Maharashtra : మహారాష్ట్రలో ఒక్కసారిగా బద్ధలైన నేల .. చీలిపోయిన రోడ్డు..!!

మహారాష్ట్రంలో ఊహించని ఘటన జరిగింది. పట్టపగలు నడిరోడ్డు ఒక్కసారిగా చీలిపోయింది.

Maharashtra : మహారాష్ట్రలో ఒక్కసారిగా బద్ధలైన నేల .. చీలిపోయిన రోడ్డు..!!

water pipeline blast in maharashtra on road

Maharashtra : ఈ దృశ్యం చూస్తే భూమికి ఏమైంది..? ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందా? నీటి ఆలవాలే కనిపించిన అక్కడ సునామీ విరుచుపడిందా? అనే ఘటన మహారాష్ట్రలో సంభవించింది. పట్టపగలు ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి బద్ధలైంది. రోడ్డు రెండుగా చీలిపోయింది. పాతాళంలోచి గంగమ్మ ఎగసిపడిందా? నడిరోడ్డుపై సునీమీ విరుచుకుపడిందా? అనేలా నీరు భారీగా ఎగసిపడింది. దీంతో ప్రజలు హడలిపోయారు. రోడ్డు ఒక్కసారిగా చీలిపోయింది. భూమి రెండుగా బద్దలై పాతాళంలోంచి నీరు ఎగసిపడినట్లుగా రెండుగా చీలిపోయిన రోడ్డులోంచి నీరు ఫౌంటెన్ లా ఎగసిపడింది. ఈ దృశ్యాల్ని అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొన్ని క్షణాలు వరకు ఆ రోడ్డు ప్రశాంతంగా కనిపించింది. ఎవరికివారు వాహనాలతో రాకపోకలు సాగిస్తున్నారు.అయితే ఒక్కసారిగా రోడ్డు రెండుముక్కలైంది. అంతేకాదు ఉప్పెనలా నీరు బయటకు ఎగిసిపడింది. ఏం జరిగిందో..జరుగుతుందో తెలియిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.అదే సమయంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.మరికొందరు మాత్రం తృటిలో తప్పించుకున్నారు.

మహారాష్ట్రంలోని యావత్ మాల్ ప్రాంతంలో పైప్ లైన్ బద్దలైందని అధికారులు తేల్చారు.. నీటి ఉదృతికి రోడ్డు ఒక్కసారిగా రెండుగా చీలిపోయి నీరు భారీగా ఎగసిపడింది. ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఊహించని ఈ ఘటనతో ఆరోడ్డుపై స్కూటీపై వెళుతున్న ఓ మహిళ గాయపడినట్లుగా తెలుస్తోంది. నీటి ఉదృతి భూమి చీలిపోయి భారీగా నీరు వచ్చింది. సెకెన్లలో ఆ రోడ్డంతా జలమయమైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది..