కరవు ఎఫెక్ట్ : మా నీళ్లు పోయాయ్ అంటు పోలీస్ కంప్లైంట్ 

కరవు ఎఫెక్ట్ : మా నీళ్లు పోయాయ్ అంటు పోలీస్ కంప్లైంట్ 

ఏవైనా విలువైన వస్తువులు పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కానీ ఓ విచిత్రమైన కంప్లైంట్ తో పోలీసులు అవాక్కయ్యారు. సాక్షాత్తు గోదావరి నది పుట్టిన నాసిక్ లో నీటి సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ ఇంట్లో ఉండే నీరు దొంగిలించబడ్డాయంటు ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో తాగునీటి సమస్య నెలకొంది. కాగా ఒక వ్యక్తి తన ఇంటిలో నీరు చోరీ జరిగిందంటూ మన్మాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటిపైన ఏర్పాటు చేసుకున్న ట్యాంకర్ లోంచి నీరు మాయమైపోతున్నాయంటు కంప్లైంట్ లో తెలిపాడు. మొదట్లో పోలీసులకు అర్థం కాకపోయినా తరువాత పరిస్థితిని అర్థం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ ఇన్పెక్టర్ సురేశ్ కుమార్ దూసర్ మాట్లాడుతు..నాసిక్ లోని  శ్రీవస్తీనగర్ లో నివసిస్తున్న ఆహిర్ అనే వ్యక్తి నీటి చోరి జరిగిందంటు కంప్లైంట్ చేశాడని తెలిపారు. వారి ఇంటిపైన ఏర్పాటు చేసుకున్న రెండు ట్యాంకులలో 500 లీటర్లను నింపుతారనీ..వాటిలో మూడు వంతుల నీరు అంటే 300 లీటర్ల నీరు మాయమైందని అహిర్ ఫిర్యాదు చేశాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.