నీళ్లు లేవు, మనీ లేదు, పవర్ లేదు : చీకట్లో స్మార్ట్ సిటీ భువనేశ్వర్

  • Published By: vamsi ,Published On : May 6, 2019 / 07:41 AM IST
నీళ్లు లేవు, మనీ లేదు, పవర్ లేదు : చీకట్లో స్మార్ట్ సిటీ భువనేశ్వర్

ఫొని పెను తుఫాను సృష్టించిన విధ్వంసానికి ఒడిశా రాష్ట్రం అతలాకుతలం అయింది. పేదవాళ్ల నుంచి ధనవంతుల వరకు ప్రతీ ఒక్కరూ తినడానికి సరైన తిండిలేక ఉండడానికి సరైన గూడు లేక, భారీవర్షాలు, ఈదురుగాలుల ప్రభావానికి ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. స్మార్ట్ సిటీ భువనేశ్వర్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మే 3వ తేదీన తుఫాను రాగా రెండు మూడు రోజుల్లో మొత్తం పరిస్థితి అదుపులోకి తెస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికీ కరెంటు, తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో ఏటిఎంలు పనిచేయక డబ్బులు అందుబాటులో లేవు. వాడుకోవడానికి, శుభ్రం చేయడానికి అయితే అసలు నీరే దొరకట్లేదు. త్రాగడానికి అయితే మరీ కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక విద్యుత్ లేక ఫోన్లు ఛార్జింగ్ లేకపోవడంతో ఇంజన్లు పెట్టి చార్జింగ్‌లు పెట్టుకుంటున్నారు. వేరే ప్రాంతాల నుంచి భువనేశ్వర్ సిటీలో చదువుకోవడానికి వచ్చిన వాళ్లు డబ్బులు లేనక చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోలు పంపుల్లో కూడా పెట్రోలు దొరకట్లేదు. కొన్ని చోట్ల అసలు బంకులు పనొచేయట్లేదు.

ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే కుటుంబాలకు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పరిహారం ప్యాకేజీ కింద 50కిలోల బియ్యం, రూ.2వేల నగదు, పాలిథిన్‌ షీట్లు అందించాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.95,100, పాక్షికంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి రూ.52వేలు పరిహారం ఇస్తామన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 15రోజుల పాటు ఉచితంగా ఆహారం అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం విద్యుత్ పునరుద్ధరించడంలో విఫలం అవగా ఏపీ ప్రభుత్వం ఒడిశాకు విద్యుత్‌ పునరుద్ధరణ కోసం ఏపీ నుంచి 1100 మందిని ఒడిశాకు పంపారు.