బెంగాల్ బీజేపీ చీఫ్ రాజీనామాకు డిమాండ్..కోల్​కతాలో కొనసాగుతున్న కార్యకర్తల ఆందోళన

బెంగాల్​లో బీజేపీ కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కోల్​కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి నుంచి బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

బెంగాల్ బీజేపీ చీఫ్ రాజీనామాకు డిమాండ్..కోల్​కతాలో కొనసాగుతున్న కార్యకర్తల ఆందోళన

Wb Polls Bjp Workers Protest Leaders Heckled Post Candidate List

BJP workers బెంగాల్​లో బీజేపీ కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కోల్​కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరినవారికి టికెట్లు కేటాయించారంటూ హేస్టింగ్స్​ కార్యాలయం ఎదుట క్యానింగ్ వెస్ట్, కుల్తలీ, జోయ్​నగర్, బిష్ణుపుర్ నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఉదయం నుంచి చేస్తున్న నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బీజేపీ అభ్యర్థులుగా పెద్ద సంఖ్యలో మాజీ టీఎంసీ నేతలకు టికెట్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించిన వీరు…పార్టీకోసం ఇంతకాలం కష్టపడిన తమవంటివారిని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అవినీతి చరిత్ర ఉన్న టీఎంసీ నేతలకు బీజేపీ టికెట్​ ఇచ్చిందని, వారిలో కొందరు తమపై దాడులు చేసినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. టీఎంసీ నుంచి వచ్చిన నేతలు వెంటనే నామినేషన్ ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. నామినేషన్​లు ఉపసంహరించుకునే వరకు పార్టీ తరఫున ప్రచారం చేసేదిలేదని స్పష్టం చేశారు. ఐదు రోజుల క్రితం తృణమూల్​ కాంగ్రెస్​ నుంచి బీజేపీలోకి వచ్చిన అర్ణబ్ ​రాయ్ తన నామినేషన్ వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇక,సోమవారం హోమ్ మంత్రి అమిత్ షా అస్సాంలో తన పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్ళబోతూ మధ్యలో కోల్ కతా లో ఆగినప్పుడు వీరంతా చెలరేగిపోయారు. అటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా నిన్నటి రోజంతా ఈ నగరంలోనే ఉన్నారు. హౌరా, సింగూరు వంటి జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను పార్టీ కార్యకర్తలు ద్వంసం చేశారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఖాకీలు ఇనుప బ్యారికేడ్లను పెట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది. హుగ్లీ, చింసూరా జిల్లాల్లో కూడా వీరు పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. సింగూర్ లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ భట్టాచార్య కు టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు ఆగ్రహం చెందారు. సంస్థాగత సమావేశాలకు వచ్చిన మధ్యప్రదేశ్ విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి ఓ షాపులో సుమారు నాలుగు గంటలపాటు ఉండిపోవలసి వచ్చింది. ఆయన ఉండగానే ఈ షాపునకు కార్యకర్తలు తాళం వేసేశారు.. ఆ తరువాత పోలీసులు వచ్చి ఆయనను అతి కష్టం మీద సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు.