Rahul Gandhi: మేం ప్రధానిని బలవంతంగా కౌగిలించుకోవాలనుకోవడం లేదు – మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రెసిడెంట్ మాయావతి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. పార్టీతో పొత్తు గురించి అడిగితే బీఎస్పీ చీఫ్ స్పందించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్య

Rahul Gandhi: మేం ప్రధానిని బలవంతంగా కౌగిలించుకోవాలనుకోవడం లేదు – మాయావతి

Mayawati

Rahul Gandhi: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రెసిడెంట్ మాయావతి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. పార్టీతో పొత్తు గురించి అడిగితే బీఎస్పీ చీఫ్ స్పందించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రెస్పాండ్ అవుతూ.. తిప్పికొట్టారు.

“బీజేపీకి బీఎస్పీ భయపడిందన్నట్లు ఉన్నాయి రాహుల్ గాంధీ ఆరోపణలు. పొత్తు గురించి సీఎం పోస్టు గురించి నాకు ఆఫర్ చేసినప్పుడు మౌనంగా ఉన్నాననేది పూర్తిగా అవాస్తవం. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కామెంట్లను బట్టి ఆయన పూర్తిగా ఇన్ఫీరియర్ ఫీలింగ్స్ లో ఉన్నారని తెలుస్తుంది” అని మాయావతి అన్నారు.

కాంగ్రెస్ సొంత పార్టీని చూసుకోలేక, తమ వ్యవహరాలను చక్కబెట్టుకోలేక మా మీద తన ప్రతాపం చూపిస్తుంది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ మాపై (బీఎస్పీ) కామెంట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించుకోవాలి. పార్లమెంట్ సాక్షిగా ప్రధానిని బలవంతంగా హత్తుకునే రాహుల్ గాంధీ లాంటి పార్టీ కాదు” అని మాయావతి అన్నారు.

Read Also: ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ మాయావతితో పొత్తు పెట్టుకునేందుకు, ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తామని కూడా ఆఫర్ చేశామని.. దానికి ఆమె మాట్లాడలేదని రాహుల్ గాంధీ శనివారం అన్నారు. బీఎస్పీ అధినేత్రిపై విరుచుకుపడిన రాహుల్, “మాయావతి ఎన్నికల్లో పోరాడలేదు, కూటమి ఏర్పాటు చేయాలని ఆమెకు సందేశం పంపాం, కానీ ఆమె స్పందించలేదు” అని రాహుల్ గాంధీ శనివారం అన్నారు.