విద్యార్థులకు మేము పెన్నులు,కంప్యూటర్లు….బీజేపీ ద్వేషం,గన్

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2020 / 01:04 PM IST
విద్యార్థులకు మేము పెన్నులు,కంప్యూటర్లు….బీజేపీ ద్వేషం,గన్

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీపై విమర్శల దాడి పెంచారు ఆప్ అధినేత కేజ్రీవాల్. తాము విద్యార్థులకు కంప్యూటర్లు,పెన్నులు ఇస్తుంటే బీజేపీ మాత్రం విద్యార్ధుల చేతికి గన్స్,ద్వేషం ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి IT-టెక్ సదస్సులో ప్రసంగిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. విద్యార్థుల చేతుల్లో పెన్నులు, వాళ్ల కళ్లల్లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కలలను ఉంచుతున్నామని,కానీ బీజేపీ వారి కళ్లల్లో ద్వేషం నింపడం,చేతికి గన్స్ ఇవ్వడం చేస్తుందని..మీ పిల్లలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఫిబ్రవరి-8న చెప్పండి అంటూ కేజ్రీవాల్ ఆ వీడియోను ట్విట్లర్ లో పోస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన 17ఏళ్ల ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి గురువారం స్కూల్ ఎగ్గొట్టి ఒస్ ఎక్కి ఢిల్లీకి వచ్చి   జామియా మిలియా యూనివర్శిటీ దగ్గర సీఏఏకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నవారిపై గన్ తో కాల్పులు జరిపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమయంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన మైనర్ కు బీజేపీ ప్రొటక్షన్ కల్పించిందని,గన్ తో నిరసనకారులపై కాల్పులు జరిపేందుకు వస్తున్న విద్యార్థిని పోలీసులు అడ్డుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

పోలీసులు ఉన్న కొద్ది దూరం నుంచే విద్యార్థి కాల్పులు జరిపాడని,పోలీసులు మాత్రం చూస్తూ కూడా గమ్మున ఉండిపోయారని,పైగా గన్ తో కాల్పులు జరుపుతున్న విద్యార్థిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఓ స్టూడెంట్ ను పోలీసులు కొట్టారని ఫస్ట్ ఇయర్ మాస్ కమ్యూనికేషన్స్ స్టూడెంట్ షాదబ్ ఫరూక్ తెలిపారు.

మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి గ్రాండ్ విక్టరీ కోసం ఆప్ అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను,మొహల్లా క్లినిక్స్ లను 5ఏళ్ల తమ పాలన ఘనతగా ఆప్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. తనను తాను ఢిల్లీకి పెద్ద కొడుకుగా కేజ్రీవాల్ చెప్పుకుంటున్నారు. దేశంలో 70ఏళ్లలో తొలిసారి మంచి స్కూల్స్,హాస్పిటల్స్ కోసం ప్రజలు ఓట్లు వేయబోతున్నారని,మరోసారి తమదే అధికారం అని కేజ్రీవాల్ చెబుతున్నారు. తమ పరిధిలోకి వచ్చే ఏరియాల్లో తాము ఈ ఐదేళ్లలో చేసిన పని చూసి మాత్రమే తాము ఓటు వేయమని ప్రజలను కోరుతున్నట్లు కేజ్రీవాల్ చెబుతున్నారు. ఫిబ్రవరి-8,2020న ఢిల్లీలో పోలింగ్ జరుగనుంది. పిబ్రవరి-11న ఫలితాలు వెలువడనున్నాయి.