Hijab ban case: హిజాబ్ వివాదాన్ని వాడుకుని సమాజాన్ని విడగొట్టాలనుకుంటున్నారు: కర్ణాటక మంత్రి

‘‘సమాజాన్ని విడగొట్టాలని కొందరు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటారు. హిజాబ్ వివాదాన్ని వాడుకుని సమాజాన్ని విడగొట్టాలని ఇప్పుడు భావిస్తున్నారు’’ అని మంత్రి బీసీ నగేశ్ చెప్పారు. ‘‘ఓ మంచి తీర్పు వస్తుందని మేము ఆశించాం. హిజాబ్/బుర్ఖా వద్దని ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఉద్యమిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతాయి. కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించకుండా ఉన్న నిషేధం కొనసాగుతుంది’’ అని చెప్పారు.

Hijab ban case: హిజాబ్ వివాదాన్ని వాడుకుని సమాజాన్ని విడగొట్టాలనుకుంటున్నారు: కర్ణాటక మంత్రి

Hijab ban case: కర్ణాటక హిజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెల్లడించడంపై ఆ రాష్ట్ర మంత్రి బీసీ నగేశ్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని కొన్ని సంస్థలు సమర్థిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘సమాజాన్ని విడగొట్టాలని కొందరు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటారు. హిజాబ్ వివాదాన్ని వాడుకుని సమాజాన్ని విడగొట్టాలని ఇప్పుడు భావిస్తున్నారు’’ అని చెప్పారు. కాగా, హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని, కర్ణాటకలోని విద్యా సంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై సర్కారు విధించిన నిషేధాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించడంతో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

‘‘ఓ మంచి తీర్పు వస్తుందని మేము ఆశించాం. హిజాబ్/బుర్ఖా వద్దని ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఉద్యమిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతాయి. కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించకుండా ఉన్న నిషేధం కొనసాగుతుంది’’ అని చెప్పారు.

కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించారు. అయితే, హైకోర్టు తీర్పును జస్టిస్ దులియా తప్పుబట్టారు. విద్యార్థుల చదువలకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సరైన ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కు సిఫార్సు చేయాలని జస్టిస్ హేమంత్ గుప్తా చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..