మతాన్ని,రాజకీయాన్ని కలిపి తప్పు చేశాం…ఉద్దవ్ ఠాక్రే

  • Published By: venkaiahnaidu ,Published On : December 24, 2019 / 09:40 AM IST
మతాన్ని,రాజకీయాన్ని కలిపి తప్పు చేశాం…ఉద్దవ్ ఠాక్రే

మతాన్ని రాజకీయాలతో కలిసి బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పటివరకు తాము చేసిన పెద్ద పొరపాటు అని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అనుకూల రాజకీయాలకు పేరుగాంచిన ఫైర్‌బ్రాండ్ అయిన ఉద్దవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి.

తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా పరిపాలన పాత్రలోకి ఎంట్రీ ఇచ్చిన ఉద్దవ్ గత వారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి శివసేన పార్టీ సిద్దాంతాలకు ఉద్దవ్ తూట్లు పొడిచారని మాజీ భాగస్వామి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఉద్దవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్,రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్ జేపీ,మెహబూబా నేతృత్వంలోని పిడిపి వంటి వ్యతిరేక భావజాల పార్టీతో బీజేపీ గతంలో పొత్తులు పెట్టుకున్న విషయాన్ని ఉద్దవ్ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ…మతం,రాజకీయాలను కలపడం,బీజేపీతో కలిసి ఉండటం శివసేన చేసిన పొరపాటు అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజల తీర్పు గురించి మాట్లాడుతున్నారని,కానీ ఇవి రాజకీయాలు అని ఉద్దవ్ అన్నారు. మహాభారతాన్ని ప్రస్తావిస్తూ… ఆ సమయంలో ‘ధర్మం’ అనుచరులు కూడా జూదంలో ఓడిపోయారన్నారు. రాజకీయాలు జాదం లాంటివన్నారు. వాటిని సరైన స్థలంలో ఉంచాలని అన్నారు. హిందుత్వ కారణంగానే బీజేపీతో 25సంవత్సరాలు తాము కలిసి ఉన్నామని ఉద్దవ్ అన్నారు. కానీ ఇప్పుడు తాము మతాన్ని మార్చేలదని,నిన్న తాము హిందువులమేనని,ఇవాళ,రేపు కూడా హిందువులమేనని,కానీ బీజేపీ మాత్రం వ్యతిరేక భావజాల పార్టీలతో పొత్తులు పెట్టుకుందని ఉద్దవ్ అన్నారు. ధర్మం గురించి మాట్లాడటమే కాకుండా తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నారు.

తమ ప్రభుత్వం రిక్షాల్లో ప్రయాణం చేసేవాళ్ల కోసమేనని,బుల్లెట్ ట్రైన్ లలో ట్రావెల్ చేసేవాళ్లకోసం కాదని మోడీ సర్కార్ పై ఉద్దవ్ సెటైర్లు వేశారు. తమది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమని,తనకు కాంగ్రెస్,ఎన్సీపీలో కొత్త ఫ్రెండ్ లు దొరికారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.