ఇలాంటి సమయంలో కావాలసింది రణ నీతి.. రాజనీతి కాదు: కేసీఆర్

  • Published By: Subhan ,Published On : June 19, 2020 / 03:39 PM IST
ఇలాంటి సమయంలో కావాలసింది రణ నీతి.. రాజనీతి కాదు: కేసీఆర్

సీఎం కేసీఆర్ ప్రధానితో అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా-చైనా బోర్డర్ అంశంలో ఇలాంటి సమయంలో మనకు కావాలసింది రణ నీతి కానీ రాజనీతి కాదని చెప్పారు. జాతి భద్రత అంశంలో కాంప్రమైజ్ కాకుండా నిర్ణయం తీసుకోవాలి. చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలతో సిద్ధం అవ్వాలని ప్రధానికి సూచించారు. 

‘మేం కేంద్రంతో పాటే ఉంటాం. దేశంలో సుస్థిరమైన పరిపాలనతో పాటు ఆర్థిక శక్తిలో ఎమర్జెన్సీ కావాలని సూచించారు. చైనా కుయుక్తులు పన్నుతుంది. మనమంతా ఐకమత్యంగా ఉండి మన ఆర్మీ బలగాలకు సపోర్ట్ ఇవ్వాలి’ అని అన్నారు. 

ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న సీఎం.. కల్నల్ సంతోష్ బాబు ఇంటికి రూ.5కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గ్రూప్ 1కేటగిరీ గవర్నమెంట్ జాబ్, ఇళ్ల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. దాంతో సంతోష్ బాబుతో పాటుగా అమరులైన 19మంది ఇతర ఆర్మీ వీరులకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 

చైనా అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు సృష్టిస్తుందని అన్నారు. మలేసియా, ఫిలిప్పీన్స్, జపాన్ లతోనూ గతంలో ఇలానే వ్యవహరించిందని అన్నారు. ప్రపంచంలో చైనా వైఖరి దారుణంగా మారిందని సీఎం అన్నారు.