Modi-Putin Talks : భారత్ ను గొప్ప శక్తిగా చూస్తున్నాం..మోదీతో భేటీలో పుతిన్

21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ఢిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో భేటీ అయ్యారు ప్రధానమంత్రి

Modi-Putin Talks : భారత్ ను గొప్ప శక్తిగా చూస్తున్నాం..మోదీతో భేటీలో పుతిన్

Modi Putin (1)

Modi-Putin Talks : ఒక్కరోజు భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్​, రష్యా 21వ వార్షిక సదస్సులో భాగంగా సోమవారం సాయంత్రం ఢిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు. అంతకుముందు పుతిన్​కు మోదీ ఘనస్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాగా,మోడీ,పుతిన్ ముఖాముఖి కలుసుకోవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2019 నవంబర్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్-మోదీ మధ్య చివరిగా ఫేస్ టూ ఫేస్ మీటింగ్ జరిగింది.

పుతిన్ తో భేటీలో మోదీ మాట్లాడుతూ..” కొవిడ్​-19 ద్వారా ఎదురైన సవాళ్లు మినహా భారత్​-రష్యా సంబంధాల వృద్ధిలో ఎలాంటి మార్పు లేదు. మన ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోంది. గత కొన్ని దశాబ్దాలలో, ప్రపంచం అనేక ప్రాథమిక మార్పులను చూసింది. వివిధ రకాల భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఉద్భవించాయి. అయితే భారత్- రష్యాల స్నేహం స్థిరంగా ఉంది. భారత్- రష్యా మధ్య బంధం నిజంగా అంతర్రాష్ట్ర స్నేహానికి ఒక ప్రత్యేకమైన, నమ్మదగిన మోడల్”అని అన్నారు.

పుతిన్ మాట్లాడుతూ…”మేము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా, సమయం పరీక్షించిన మిత్రదేశంగా భావిస్తున్నాము. మన దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తు సంబధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నాను. ప్రస్తుతం, మ్యూచువల్ ఇన్వెస్ట్‌మెంట్‌లు దాదాపు 38 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి, రష్యా వైపు నుండి కొంచెం ఎక్కువ పెట్టుబడి వస్తోంది. వేరే ఏ దేశం చేయని విధంగా సైనిక మరియు సాంకేతిక రంగాలలో గొప్పగా మేము సహకరిస్తాము. భారత్-రష్యా కలిసికట్టుగా హై టెక్నాలజీలను అభివృద్ధి చేస్తాయి, అలాగే భారతదేశంలో ఉత్పత్తి చేస్తాము. సహజంగానే, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న ప్రతిదాని గురించి మేము ఆందోళన చెందుతున్నాము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం అంటే… మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటమే. అఫ్ఘానిస్తాన్‌లో పరిణామాల గురించి మేము ఆందోళన చెందుతున్నాము”అని పుతిన్ అన్నారు.

ఇక,మోదీ-పుతిన్ భేటీకి ముందు భారత్-రష్యా 21వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా రెండు దేశాల మధ్య తొలిసారి 2 ప్లస్ 2 సమావేశం ఢిల్లీలో జరిగింది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. రష్యా రక్షణ మంత్రి సెర్జి షోయ్ తో చర్చలు జరిపి, కీలక ఒప్పందాలపై సంతకాలు చేయగా, మరోవైపు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్జీలావ‌రోవ్ తో భేటీ అయి, కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్-రష్యా దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరు లక్షల ఏకే-203 రైఫిల్స్​ను సంయుక్తంగా తయారు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉత్తర్​ప్రదేశ్​ అమేథీలో వీటిని తయారు చేయనున్నారు. రైఫిల్స్​ తయారీతో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపైనా ఇరు దేశాలు ఒప్పందాల్ని చేసుకున్నాయి.

ALSO READ Work From Home New Norm : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కొత్త చట్టం.. ఫ్రేమ్‌వర్క్‌పై కేంద్రం కసరత్తు!