ఏసుక్రీస్తు బోధనలను మనం గుర్తుంచుకోవాలి: ప్రధాని మోడీ

ఏసుక్రీస్తు బోధనలను మనం గుర్తుంచుకోవాలి: ప్రధాని మోడీ

Modi

దేవుడి కృప అందరి మీద ఉండాలంటూ.. దేశ ప్రజలు అందరికీ, ‘ఈస్టర్‌ శుభాకాంక్షలు’ తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఏసుక్రీస్తు ధర్మబద్ధమైన బోధనలను మనం గుర్తుంచుకోవాలని, సామాజిక సాధికారతపై ఏసుక్రీస్తు చెప్పిన బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపినట్లుగా చెప్పుకొచ్చారు నరేంద్రమోడీ.


ఛాతిలో నొప్పి కారణంగా బైపాస్‌ సర్జరీ చేయించుకొని కోలుకుంటున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఈస్టర్ సంధర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా వేడుకగా జరుపుకొనే ఈస్టర్‌ పర్వదినం మనకు ఆశలను, ఆనందాలను అందజేస్తుంది. మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతుంది. ఏసుక్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, ఆప్యాయత, సామరస్యాన్ని పెంపొందిస్తాయి’ అని వెల్లడించారు.


కరోనా కారణంగా గతేడాది ఈస్టర్ వేడుకలు తక్కువగా జరగగా.. ఈ ఏడాది ప్రతి చర్చ్‌లోనూ సందడి వాతావరణం కనిపిస్తోంది.