Wrestlers : పతకాలను గంగా నదిలో విసిరేస్తాం.. దేశ ప్రజలకు రెజ్లర్ల లేఖ
తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా రెజ్లర్లు ఏదైనా నేరం చేశారా? అని నిలదీశారు. పోలీసులు, వ్యవస్థ తమను నేరస్థులలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Wrestlers
Wrestlers Protest : తమపై జరుగుతున్న వేధింపులకు నినరసనగా రెజ్లర్లు పోరు ఉధృతంం చేశారు. ఈ మేరకు దేశ ప్రజలకు రెజ్లర్లు లేఖ రాశారు. మే 28న ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు. పోలీసులు తమతో ఎలా ప్రవర్తించారు? తమను ఎంత క్రూరంగా అరెస్టు చేశారో అందరికీ తెలుసన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేశామని, తమ ఆందోళన స్థలాన్ని కూడా పోలీసులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తీవ్రమైన కేసులలో తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాపోయారు.
తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా రెజ్లర్లు ఏదైనా నేరం చేశారా? అని నిలదీశారు. పోలీసులు, వ్యవస్థ తమను నేరస్థులలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తమకు ఏమీ మిగిలి లేదన్నారు. ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన ఆ క్షణాలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఎందుకు బతికామని అనిపిస్తోందన్నారు.
వ్యవస్థ తమతో చెడుగా ప్రవర్తించేలా తాము జీవించామా? తమను లాగి తర్వాత దోషులుగా మార్చారని బాధపడ్డారు. నిన్న రోజంతా మహిళా రెజ్లర్లు చాలామంది పొలాల్లో దాక్కున్నారని పేర్కొన్నారు. రెజ్లర్ల ఆందోళనను విచ్ఛిన్నం చేయడంలో బ్రిజ్ భూషణ్ నిమగ్నుడై ఉన్నాడని వెల్లడించారు. తమ మెడలో అలంకరించిన ఈ పతకాలకు అర్థం లేదని.. వాటిని తిరిగి ఇచ్చేయాలనే ఆలోచనతో ఉన్నామని తెలిపారు. తమ ఆత్మగౌరవంతో రాజీపడి జీవించడం ఎందుకు అని అన్నారు.
రాష్ట్రపతి తమ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో కూర్చుని చూస్తూనే ఉన్నారు.. కానీ, ఏమీ మాట్లాడలేదని వాపోయారు. తమను తన ఇంటి ఆడపడుచులుగా పిలిచే ప్రధానికి ఒక్కసారి కూడా తన ఇంటి ఆడబిడ్డలను చూసుకోకపోవడం కోసం మనసు ఒప్పుకోలేదన్నారు. ఈ మెరుస్తున్న వ్యవస్థలో తమ స్థానం ఎక్కడ ఉంది, భారతదేశపు కుమార్తెల స్థానం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాము కేవలం నినాదాలుగా మారిపోయామా లేదా అధికారంలోకి రావడానికి అజెండాగా మారిపోయామా? అని నిలదీశారు.
Atchutapuram : మిస్టరీగా మారిన యువతి మృతి.. మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం
తమకు ఈ పతకాలు ఇక అవసరం లేదు.. వీటిని గంగలో పోయబోతున్నామని చెప్పారు. ఎందుకంటే ఆమె తల్లి గంగా అని అన్నారు. గంగను మనం ఎంత పవిత్రంగా భావిస్తామో.. అంత పవిత్రంగా కష్టపడి ఈ పతకాలు సాధించామని తెలిపారు. ఈ పతకాలు దేశం మొత్తానికి పవిత్రమైనవని.. పవిత్రమైన పతకాన్ని ఉంచడానికి సరైన స్థలం పవిత్రమైన గంగా మాత అని పేర్కొన్నారు.
పతకం తమ ప్రాణం, తమ ఆత్మ అని అభిర్ణించారు. పతకాలు గంగా నదిలో కొట్టుకుపోయిన తర్వాత తమ జీవితానికి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. పతకాలు గంగలో వేసి ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఇండియా గేట్ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మన అమరవీరుల ప్రదేశం అని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు, తమ భావాలు కూడా ఆ సైనికుల మాదిరిగానే ఉన్నాయని తెలిపారు.
Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్
అపవిత్ర వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు. ఇప్పుడు ప్రజలు తమ ఆడబిడ్డలతో నిలబడుతారా లేదా ఈ కుమార్తెలను వేధిస్తున్న వ్యవస్థతో నిలబడతారా అని ఆలోచించాలి అని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగానదిలో పతకాలను విసిరేస్తామని చెప్పారు. ఈ గొప్ప దేశానికి తాము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని రెజ్లర్లు తెలిపారు.