CBI raids: ‘మేము భయపడబోం’.. నితీశ్ బలపరీక్ష ఎదుర్కోనున్న వేళ బిహార్‌లో సీబీఐ దాడులపై లాలూ భార్య రబ్రీదేవి

బిహార్‌లోని పలువురు రాష్ట్రీయ జనతా దళ్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దాడులు చేస్తోన్న నేపథ్యంలో దీనిపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవి మండిపడ్డారు. బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందుకు, బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఏకమైనందుకు బీజేపీ భయపడుతోందని అన్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని, తాము భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటువంటి దాడులు జరగడం తమకు కొత్తేమీకాదని అన్నారు.

CBI raids: ‘మేము భయపడబోం’.. నితీశ్ బలపరీక్ష ఎదుర్కోనున్న వేళ బిహార్‌లో సీబీఐ దాడులపై లాలూ భార్య రబ్రీదేవి

CBI raids

CBI raids: బిహార్‌లోని పలువురు రాష్ట్రీయ జనతా దళ్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దాడులు చేస్తోన్న నేపథ్యంలో దీనిపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవి మండిపడ్డారు. బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందుకు, బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఏకమైనందుకు బీజేపీ భయపడుతోందని అన్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని, తాము భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటువంటి దాడులు జరగడం తమకు కొత్తేమీకాదని అన్నారు.

కాగా, నితీశ్ కుమార్ బలపరీక్ష ఎదుర్కోనున్న రోజే ఆర్జేడీ నేతల ఇళ్ళపై సీబీఐ దాడులు జరుగుతుండడం గమనార్హం. దీనిపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ.. ‘ఇవి ఈడీ, ఐటీ, సీబీఐ చేస్తోన్న దాడులు కాదు.. ఇవి బీజేపీ చేస్తోన్న దాడులు. ఆయా ఏజెన్సీలు బీజేపీ కింద పనిచేస్తున్నాయి. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం ఆయా కార్యాలయాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇవాళ బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఊహించిన విధంగానే ఇక్కడ దాడులు జరుగుతున్నాయి.

రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసులో ఇవాళ సీబీఐ దాడులు చేస్తోంది. 2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. 2009లో జరిగిన రిక్రూట్‌మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్‌ డీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవి, కూతురు మిసా భారతీతో పాటు ఉద్యోగాలు పొందిన పలువురిని సీబీఐ నిందితులుగా చేర్చింది. ఈ కేసులోనే ఇవాళ పట్నాలో సీబీఐ సోదాలు జరుపుతోంది.

Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..