Dalai Lama : దలైలామా ఎంపికపై చైనా దూకుడు

బౌద్ధ గురువు దలైలామా ఎంపికపై చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. దలైలామా వారసుడి ఎంపికపై ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. టిబెట్‌ చైనాలో భాగమని.... దలైలామాను తామే ప్రకటిస్తామని విర్రవీగుతోంది. సరిహద్దులో భూఆక్రమణలకు కుట్ర పన్నుతోంది డ్రాగన్.

Dalai Lama :  దలైలామా ఎంపికపై చైనా దూకుడు

Dalai Lama

Dalai Lama :  బౌద్ధ గురువు దలైలామా ఎంపికపై చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. దలైలామా వారసుడి ఎంపికపై ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. టిబెట్‌ చైనాలో భాగమని…. దలైలామాను తామే ప్రకటిస్తామని విర్రవీగుతోంది. సరిహద్దులో భూఆక్రమణలకు కుట్ర పన్నుతోంది డ్రాగన్. దలైలామా అంశంపై భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. 1959లో టిబెట్ ప్రజల తిరుగుబాటును చైనా అణిచివేసింది. దీంతో దలైలామా టిబెట్‌ను వీడి భారత్‌లో ప్రవేశించారు. అప్పటినుంచి దలైలామాకు భారత్ ఆశ్రయమిస్తోంది.

చైనా అరాచకాలు భరించలేక బౌద్ధ గురువు దలైలామా భారత్ వచ్చేసి దశాబ్దాలు గడిచిపోయింది. ఎన్నో ఏళ్లుగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు దలైలామా. మీ పెత్తనం, అజమాయిషీ మాకొద్దు బాబోయ్  అని దలైలామా, టిబెట్ ప్రజలు మొత్తుకుంటున్నా…చైనాకు మాత్రం చెవికెక్కడం లేదు. అవకాశం ఉన్నా లేకపోయినా…టిబెట్ పైనా…దలైలామాపైనా…తన పెత్తనం నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

ఇప్పుడు…దలైలామా వారసుడి ఎంపిక వ్యవహారంలోనూ చైనా ఇలాగే ప్రవర్తిస్తోంది. 14వ దలైలామాకు వయసు మీద పడడంతో కొన్నాళ్లుగా వారసుడి ఎంపికపై చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే చైనా…ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. దలైలామా వారసుడి ఎంపికతో పాటు..పనిలో పనిగా…సరిహద్దు ప్రాంతాల ఆక్రమణపై కూడా ..ఈ శ్వేతపత్రంలో తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది డ్రాగన్.

1951 నుంచీ టిబెట్…దాని విమోచనం, అభివృద్ధి, శ్రేయస్సు అనే పేరుతో విడుదల చేసిన శ్వేతపత్రంలో దలైలామా వారసుడి ఎంపికతో పాటు.. సరిహద్దు గ్రామాల అభివృద్ధి గురించి చైనా ప్రస్తావించింది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువగా వచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా. దీనికి టిబెట్ సరిహద్దుల్లోని మారుమూల గ్రామాల్లో… మౌలిక వసతుల విస్తరణ ముసుగు వేసింది.

సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పెంచడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించే వ్యూహం అమలుచేస్తోంది. పేదరికం ఎక్కువగా ఉండే..టిబెట్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి పనులకు ఏటా నిధులు కేటాయింపులు పెంచుతామని…. శ్వేతపత్రంలో తెలిపింది. దాదాపు పదేళ్లుగా చైనా ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. సరిహద్దు గ్రామాల అభివృద్ధితో పాటు కొత్త ఊళ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. జాతీయ రహదారులతో పాటు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించింది.

బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపికలో తమ జోక్యం ఉండి తీరుతుందని శ్వేతపత్రంలో చైనా తేల్చిచెప్పింది. వారసుడు ఎవరైనా తమ ఆమోదం తప్పనిసరని…ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయమని తెలిపింది. బౌద్ధ గురువుల వారసులకు… 17,18 శతాబ్దాల నుంచి చైనా రాజుల ఆమోదం తప్పనిసరి నిబంధనగా ఉండేదని శ్వేతపత్రంలో వివరించింది. ఇష్టానుసారం ఎవరో ఒకరిని నియమిస్తే గుర్తించబోమని తెలిపింది. ప్రాచీనకాలం నుంచి టిబెట్ చైనాలో భాగమని చెప్పుకొచ్చింది.