కారులో సింగిల్‌గా ఉన్నా మాస్క్ ధరించాల్సిందే – ఢిల్లీ ప్రభుత్వం

  • Published By: madhu ,Published On : November 19, 2020 / 01:17 AM IST
కారులో సింగిల్‌గా ఉన్నా మాస్క్ ధరించాల్సిందే – ఢిల్లీ ప్రభుత్వం

Wearing face masks compulsory : కారులో సింగిల్ గా ఉన్నా..మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టుకు ఆప్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, బహిరంగ ప్రదేశాలతో పాటు కారులో ఒక్కరు ఉన్నా..తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వెల్లడింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో మాస్క్ పెట్టుకోలేదని తనకు రూ. 500 ఫైన్ వేశారని, నిబంధనలకు ఇది వ్యతిరేకమంటూ న్యాయవాది సౌరభ్ శర్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



తనపై విధించిన జరిమాన రూ. 500 చెల్లించాలని, మానసికంగా వేధింపులకు గురి చేసినందుకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీనిపై గతంలో కోర్టు విచారించింది. అనంతరం పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించడంతో ప్రభుత్వం 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం కోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం, పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. సెప్టెంబర్ 09వ తేదీన కారులో వెళుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు ఆపారని, మాస్క్ ధరించనందుకు రూ. 500 ఫైన్ వేశారని తెలిపారు.



బహిరంగ ప్రదేశంలో, పని చేస్తున్న సమయంలో మాస్క్ ధరించాలని DDMA మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ వివరాలను శర్మ న్యాయవాది వివరించారు. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ వ్యక్తి అయినా..తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు..జనవరి 07వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.