కరోనా వైరస్ : ఆరు నెలలు Maskలు తప్పనిసరి

కరోనా వైరస్ : ఆరు నెలలు Maskలు తప్పనిసరి

wearing masks mandatory for next six months : కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే..కొన్ని రాష్ట్రాలు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా..వచ్చే ఆరు నెలల పాటు మాస్క్ (Mask)లు ధరించడం తప్పనిసరి అని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డవుతున్నాయి. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం ఒక్కరోజే 3 వేల 940 కేసులు నమోదయ్యాయి. 74 మంది చనిపోయారు. మరణాల సంఖ్యలో మహారాష్ట్రనే తొలి స్థానంలో ఉండడం గమనార్హం.

రాత్రి వేళ కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ విధించాలని నిపుణులు చెబుతున్నారని, అయితే..రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో ఉన్న కారణంగా..తాను అంగీకరించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వెల్లడించారు. అయితే..ప్రజలు మాత్రం నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని, వచ్చే ఆరు నెలల పాటు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అన్నారు. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని, చికిత్స కంటే..నివారణే ఉత్తమమని ఉద్దవ్ థాక్రే అన్నారు. Maha Vikas Aghadi ప్రభుత్వం నవంబర్ 28వ తేదీతో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. కానీ..తొలుత ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం జరిగింది. కొన్ని క్లిష్ట పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంది.