పంచె కట్టిన మోడీ..మహాబలిపురంలో జిన్ పింగ్ కు స్వాగతం

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2019 / 12:03 PM IST
పంచె కట్టిన మోడీ..మహాబలిపురంలో జిన్ పింగ్ కు స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. పంచెకట్టుతో మహాబలిపురానికి చేరుకున్న మోడీ.. శోర్‌ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. మోడీజిన్‌పింగ్‌ ఇరువురు కలిసి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు.

పాండవుల పంచరథాలను మోడీ,జిన్ పింగ్ వీక్షించారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశానికి జిన్ పింగ్ ను మోడీ తీసుకెళ్లారు. శిల్పాలను ఆశక్తిగా పరిశీలించారు జిన్ పింగ్. ఇరువురు నేతలు కొబ్బరి నీళ్లు త్రాగారు. మహాబలిపురం ప్రాశస్త్యాన్ని జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ వివరిస్తున్నారు.