Weather Report : చల్లని కబురు.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు

Weather Report : వేసవిలో ఉక్కపోతతో అల్లల్లాడుతున్న భారతావనికి వాతావరణ కేంద్రం (IMD) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయి.

Weather Report : చల్లని కబురు.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు

Weather Report Southwest Monsoon Likely To Arrive In India Earlier Than Expected, Check Details

Weather Report : వేసవిలో ఉక్కపోతతో అల్లల్లాడుతున్న భారతావనికి వాతావరణ కేంద్రం (IMD) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయి. ఈ నెల 15న దక్షిణ అండమాన్‌, అగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మొదటగా రుతుపవనాలు అండమాన్​ నికోబార్​ దీవులను తాకనున్నాయి. ఈనెల 15న ఆ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి కేరళలో 15 రోజుల్లోనే రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలాఖరున కేరళ తీరాన్ని తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

కేరళ నుంచి తెలంగాణకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి 5 నుంచి 6 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతి ఏటా వచ్చే జూన్‌ 8 కన్నా ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాది జూన్ 5కి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినా సరైన వర్షాలు పడలేదు. ఈసారి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత దిశ మారేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంటున్నారు. వచ్చే మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని అంచనా. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read Also : Weather Update: తగ్గేదేలే అంటున్న సూర్యుడు.. మరో రెండు రోజులు వడగాలులు