రాఫెల్ వెడ్డింగ్ కార్డు : ముచ్చటపడ్డ మోదీ  

రాఫెల్ థీమ్ తో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ : నేటి యువత వెడ్డింగ్ కార్డ్స్ ను క్రియేటివ్ గా డిజైన్ చేసుకుంటున్నారు.  ఇటువంటి వెడ్డింగ్ కార్డ్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్ కు చెందిన ఓ యువ జంట పెండ్లికి డిజైన్ చేసుకున్న వెరైటీ వెడ్డింగ్ కార్డుకు ప్రధాని నరేంద్రమోదీ ముచ్చటపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 07:56 AM IST
రాఫెల్ వెడ్డింగ్ కార్డు : ముచ్చటపడ్డ మోదీ  

రాఫెల్ థీమ్ తో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ : నేటి యువత వెడ్డింగ్ కార్డ్స్ ను క్రియేటివ్ గా డిజైన్ చేసుకుంటున్నారు.  ఇటువంటి వెడ్డింగ్ కార్డ్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్ కు చెందిన ఓ యువ జంట పెండ్లికి డిజైన్ చేసుకున్న వెరైటీ వెడ్డింగ్ కార్డుకు ప్రధాని నరేంద్రమోదీ ముచ్చటపడ్డారు.

రాఫెల్ వెడ్డింగ్ కార్డ్స్
జనవరి 22న యువరాజ్, సాక్షిల వివాహం
సోషల్ మీడియాలో పోస్ట్
ముచ్చట పడ్డ ప్రధాని మోదీ..జంటకు అభినందల లేఖ 

గుజరాత్ : నేటి యువత వెడ్డింగ్ కార్డ్స్ ను క్రియేటివ్ గా డిజైన్ చేసుకుంటున్నారు.  ఇటువంటి వెడ్డింగ్ కార్డ్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్ కు చెందిన ఓ యువ జంట పెండ్లికి డిజైన్ చేసుకున్న వెరైటీ వెడ్డింగ్ కార్డుకు ప్రధాని నరేంద్రమోదీ ముచ్చటపడ్డారు.  ఆ వెరైటీ వెడ్డింగ్ కార్డ్ ను  రాఫెల్ థీమ్ తో డిజైన్ చేసుకున్నారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన మోదీ ఆ యువజంటను అభినందిస్తు ఓ లేఖను పంపించారు. 

సూరత్ కు చెందిన యువరాజ్ పోఖర్ణ, సాక్షి అగర్వాల్ జంటకు జనవరి 22న వివాహం జరగనుంది. ఈ క్రమంలో వీరు ‘నిశ్శబ్దంగా ఉండి నమోను నమ్మండి’ అనే టైటిల్ తో రాఫెల్ డీల్ గురించి వివరాలను వెడ్డింగ్ కార్డులో పొందుపరిచారు. ఈ డీల్ దేశానికి మంచిదని పోఖర్ణ, సాక్షి అగర్వాల్  అభిప్రాయపడ్డారు. అంతేకాదు తమ పెళ్లికి వచ్చే అతిథులంతా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు.

దీనిపై మోదీ స్పందిస్తూ, “యువరాజ్, సాక్షిల వివాహం సందర్భంగా పోకర్ణ ఫ్యామిలీకి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలపవటంతో పాటు వారికి రాసిన లేఖలో మీ వివాహ శుభలేక వెరైటీగా వుందనీ… దేశంపై మీకున్న ప్రేమ తెలుస్తోందనీ..దేశం కోసం..దేశ అభివృద్ధి కోసం మరింతగా కృషి చేయాలనే మీ శుభలేక నాకు గుర్తు చేస్తోంది” అని తెలిపారు. వారిద్దరి జీవితమూ బాగుండాలని తాను కోరుకుంటున్నానని కూడా మోదీ లేఖలో వ్యాఖ్యానించారు.