ఎకోఫ్రెండ్లీ పెళ్లి : సంస్కృతంలో శుభలేఖలు..గోమాత సాక్షిగా వివాహం..

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 10:29 AM IST
ఎకోఫ్రెండ్లీ పెళ్లి : సంస్కృతంలో శుభలేఖలు..గోమాత సాక్షిగా వివాహం..

గుజరాత్‌లోని సూరత్‌లో రోహిత్ కుమార్, అభిలాషల జంట గోమాత సాక్షిగా ఫిబ్రవరి 3న వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ వేడుకలో గోమాతతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. రోహిత్ కుమార్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ చేయగా..అభిలాష చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)గా పనిచేస్తున్నారు. 

భారతదేశంలో గోమాతను సాక్షిగా భావిస్తూ చేసుకునే తొలి వివాహం మాదేనని ఆనందంగా చెబుతున్నారు రోహిత్ కుమార్, అభిలాషలు. అచ్చమైన భారతీయ సంప్రదాయం ప్రకారంగా మేము వివాహం చేసుకుంటామని తెలిపారు. ఆవును తల్లిగా భావించే హిందూ సంస్కృతిని తాము ఎంతగానో గౌరవిస్తామని..నమ్ముతామని తెలిపారు. ప్రాచీన హిందూ వ్యవస్థలో ఆవును కామధేనువుగా కొలిచేవారనీ..ఆవు ఉన్న ప్రతీ ఇల్లు సంతోషంగా ఉంటుందనీ..అందుకే తాము గోమాత సాక్షిగా వివాహం చేసుకోవాలనుకున్నామని..తమ వివాహంలో పర్యావరణ హితం కోరుతూ ప్లాస్టిక్ వాడకుండా మట్టి గ్లాసులను వాడతామని తెలిపారు.

అంతేకాదు రోహిత్, అభిలాషలు బంధువులను ఆహ్వానించేందుకు తమ వివాహ పత్రికను  సంస్కృతంలో తయారుచేయించారు. కాగితాలను ఆదా చేయటానికి తమ వివాహ పత్రికను వాట్సాప్, ఈ మెయిల్స్ ద్వారా తమ బంధువులకు..స్నేహితులకు పంపిస్తున్నారు. 

ఈ సందర్భంగా పెళ్లి కుమారుడు రోహిత్ కుమార్ తండ్రి రాంపాల్ మాట్లాడుతూ..తమ రెండు కుటుంబాలు ఒకే వృత్తికి చెందినవనీ..ఎప్పటి నుంచి ఇరు కుటుంబాలు స్నేహితులుగా ఉంటున్నామని తెలిపారు.వేద సంస్కృతిని అనుగుణంగా మా పిల్లల వివాహం జరిపించాలనుకున్నామనీ ఈ వివాహ వేడుక ధర్మబద్దంగా జరపాలనుకున్నామని తెలిపారు.