పెళ్లిపీటల మీదే కుప్పకూలి చనిపోయిన వధువు..

  • Published By: nagamani ,Published On : June 29, 2020 / 05:30 PM IST
పెళ్లిపీటల మీదే కుప్పకూలి చనిపోయిన వధువు..

యూపీలోని కనౌజ్‌ జిల్లాలో థాథియా పోలీసు సర్కిల్ పరిధిలోని భగత్‌పూర్వ గ్రామంలోని ఓ ఇంటిలో పెళ్లి పందిట్లో మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లి వాతావరణ చాలా సందడి సందడిగా జరుగుతోంది. అమ్మా..పెళ్లి కుమార్తెను తీసుకురండమ్మా..అంటూ పురోహితుడు పిలిచాడు. ముతైదువులు పెళ్లికూతుర్ని పెళ్లిమండపంలోకి తీసుకొచ్చారు. పెళ్లితో తన కొత్త జీవితాన్ని ఊహించుకొని కలలు కన్న పెళ్లికూతురు ఒక్కసారిగి పెళ్లిపీటలమీదను కుప్పకూలిపోయింది. అలా కూలిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులతో పాటు మగపెళ్లివారు..పెళ్లికొచ్చినవారంతా ఒక్కసారి షాక్ అయ్యారు.

భగత్‌పూర్వ గ్రామంలో జూన్ 27న సంజయ్, వినీతలకు పెళ్లి నిశ్చయించారు. సంప్రదాయం ప్రకారం వధువు ఇంట్లో శుక్రవారం (జూన్ 26,2020) రాత్రి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నాడు. పెళ్లితంతు జరుగుతున్న సమయంలో వనిత ఒక్కసారిగా పెళ్లి పీటలపై కుప్పకూలిపోయింది.

దీంతో ఆందోళన చెందిన తండ్రి కిషోరా బాతం వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా భయం వల్ల ఏ ఆస్పత్రి ఆమెను చేర్చుకోలేదు. దీంతో కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే వనిత కన్నుమూసింది. ఈ విషాద ఘటనతో పెళ్లి పందిట్లో మోగాల్సిన మేళాలు, ఆమె చావుకు భజాలుగా మారాయి. ఈ ఆకస్మిక మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాతనే ఆమె ఎందుకు? చనిపోయిందనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

భర్తతో ఏడు అడుగులు నడవాల్సిన నవ వధువు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మగపెళ్లివారు ఏం చేయాలో తెలీక మిన్నకుండిపోయారు. మరికొన్ని క్షణాల్లో మెడలో మూడు ముళ్లు పడతాయనే లోపే పెళ్లి పీటల మీదే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలిన ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లికొచ్చిన బంధువుల్ని..ఆత్మీయుల్ని తీవ్రంగా కలిచి వేసింది.

Read:సూపర్ పవర్ బైక్ పై చీఫ్ జస్టిస్ చక్కర్లు