Weekend lockdown : మళ్లీ మహా లాక్‌డౌన్‌.. నిత్యావసరాలు మినహా అన్ని బంద్

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే మహారాష్ట్రలో 57వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి‌. కరోనా బారినపడి 222 మంది చనిపోయారు.

Weekend lockdown : మళ్లీ మహా లాక్‌డౌన్‌.. నిత్యావసరాలు మినహా అన్ని బంద్

Weekend Lockdown Maharashtra Shuts Eateries, Malls, Curbs Travel Amid Covid Surge

Weekend lockdown : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే మహారాష్ట్రలో 57వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి‌. కరోనా బారినపడి 222 మంది చనిపోయారు. ఒక్క ముంబైలోనే 11వేల కేసులు, 25 మరణాలు సంభవించాయి‌. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4లక్షల 30వేల యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క ముంబైలో 68వేల యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. మరో కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆదేశాలు జారీ అయ్యాయి‌. కరోనా మహమ్మారి ఉధృతిపై మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది.

కరోనా ఆంక్షలు నేటి నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది ప్రభుత్వం. వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తి లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు జిల్లాలు, నగరాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలులో ఉండటంతోపాటు పగలు సమయంలోనూ ఐదుగురు కంటే ఎక్కువ మంది ఏర్పడే అవకాశం లేదు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు కూడా కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని తెలిపారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. వారాంతాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించనున్నారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని షాపులు ఈ నెలాఖరు వరకు మూసివేసియాలని ఆదేశాలు జారీ చేసింది మహా ప్రభుత్వం.

నిత్యావసరం కానీ వస్తువులను కొనేందుకు సోమవారం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. రెస్టారెంట్లలోనూ టేక్అవే మాత్రమే ఆపరేట్ చేయాల్సిందిగా పేర్కొంది. పగలు మాత్రమే హోం డెలివరీ సర్వీసులను నడపాల్సిందిగా ఆదేశించింది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పగటిపూట కనిపించరాదు. వారాంతాలలో ఉదయం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి ఉంటాయి. ఎలాంటి మత, సంప్రదాయ, రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేటు ట్యూషన్ క్లాసులు మాత్రం మూసివేసి ఉంటాయి.

వారంలో వీకండ్ లతో కలిపి అన్నిరోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని థియేటర్లు, సినిమా హాల్స్, మాల్స్, గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్ మూసివేస్తారు. రద్దీ లేకుండా ఫిల్మ్ షూటింగ్ జరుపుకోవచ్చు. జిమ్ లు, సెలూన్ లు, బ్యూటీ పార్లర్లు కూడా మూసివేయాల్సిందే.. ప్రైవేటు వాహనాలు, ప్రైవేటు బస్సులు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అది కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు నడిచేందుకు అనుమతి ఉంది.