చత్తీస్ ఘడ్ పోలీసులకు వారాంతపు సెలవులు

  • Published By: chvmurthy ,Published On : March 11, 2019 / 03:11 AM IST
చత్తీస్ ఘడ్ పోలీసులకు వారాంతపు సెలవులు

రాయ్ పూర్ : చత్తీస్ ఘడ్ పోలీసులకు వారంతపు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  సెలవు లేకుండా  నిర్విరామంగా  విధులు నిర్వరిస్తున్న  పోలీసులకు  ఉపశమనం కలిగించేందుకు  వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్ధి తెలిపారు కానిస్టేబుల్ స్ధాయి నుంచి  ఇన్స్పెక్టర్ స్ధాయి  వరకు అందరు పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు  కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు

 పోలీసులు ఎక్కువ సేపు నిలబడి డ్యూటీ చేయటం, విధుల్లో ఉండే ఒత్తిడి దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవస్ధి  చెప్పారు.  అయితే అత్యవసర పరిస్ధితుల్లో  వారాంతపు  సెలవు ఉండదని  అదే నెలలో పెండింగ్ లో ఉన్న సెలవు వాడుకునే  వెసులు బాటు ఉంటుందని  తెలిపారు.  నక్సల్స్ ప్రభావిత  ప్రాంతాల్లో పని చేసే వారికి  ప్రతి 3 నెలలకోసారి 8 రోజులు సెలవు తీసుకునే అవకాశం  కల్పించారు. శాంతిభద్రతల కారణాల వల్ల కొన్నిసార్లు వారాంతపు సెలవులు రద్దు చేసే అవకాశం కూడా ఉందని డీజీపీ చెప్పారు.