వెల్ కం అభినందన్ : స్వాగతం పలుకుతున్న దేశం

  • Published By: madhu ,Published On : March 1, 2019 / 04:45 AM IST
వెల్ కం అభినందన్ : స్వాగతం పలుకుతున్న దేశం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్థమాన్‌‌కి భారతదేశం వెల్ కం చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో అభినందన్ పేరు మారుమాగుతోంది. #WelcomeBackAbhinandan హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఎంతోమంది అభినందన్ తెగువను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఆయన రాక కోసం భారతదేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనితో వాఘా వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 

మార్చి 01వ తేదీ శుక్రవారం ఆయన వాఘా సరిహద్దు వద్ద ఆయన్ను విడిచిపెట్టనున్నారు. జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ ఆఫీసర్స్ అంతర్జాతీయ రెడ్ క్రాస్‌ వారికి అభినందన్ అప్పగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్యలో భారతదేశానికి చేరుకుంటాడని అంచనా. అభినందన్‌‌కు వెల్ కం చెప్పేందుకు వాఘా సరిహద్దు వద్దకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. ఐఏఎఫ్ అధికారులు ఘనంగా స్వాగతం పలికేందుకు రెడీ అయిపోయారు. 

అభినందన్‌ని విడుదల చేస్తామని పాకిస్తాన్ పార్లమెంట్‌లో స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అమెరికా, యుఏఈతో పాటు ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్య దేశాల నుంచి కూడా ఒత్తిడి తీవ్ర మవ్వడంతో.. పాక్‌ వెనక్కితగ్గింది. మరో దారి లేక అభినందన్‌ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది.