Bullock Cart: పెట్రోల్ ధరల ప్రభావం.. ఎడ్లబండ్లపై పెళ్లి బృందం

ఈ సందర్బంగా వరుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు ధరలు భారీగా ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఎడ్లబండ్లపై పెళ్లి వేడుకకు వెళ్తున్నామని తెలిపాడు.

Bullock Cart: పెట్రోల్ ధరల ప్రభావం.. ఎడ్లబండ్లపై పెళ్లి బృందం

Bullock Cart

Bullock Cart: పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గుమంటున్నాయి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు వంద దాటాయి. ఇక ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై సోషల్ మీడియా వేదికగా అనే వార్తలు, జోకులు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకు నిరసనగా ఓ పెళ్లి బృందం ఎడ్ల బండ్లపై వివాహ వేదికకు వచ్చారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దేవరియా జిల్లా కుషారీ గ్రామానికి చెందిన ఛోటే లాల్‌ తన గ్రామం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పక్రీ బజార్‌లో పెళ్లి మండపానికి ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చాడు. ఈ సందర్బంగా వరుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు ధరలు భారీగా ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఎడ్లబండ్లపై పెళ్లి వేడుకకు వెళ్తున్నామని తెలిపాడు.

అంతే కాకుండా తాను చిన్నప్పటి నుంచి ఎడ్లబండిపై వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడినని అదే విధంగా ఇప్పుడు చేసుకున్నానని తెలిపాడు. ఇలా వెళ్లడం వలన వాయు కాలుష్యాన్ని తగ్గించ వచ్చని తెలిపారు ఛోటే లాల్‌. ఇక ఈ సంక్షోభ సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారు.