Raj Kundra: పోర్న్ వీడియోలు డిలీట్ చేయమని చెప్పారంటోన్న ఉద్యోగులు

రాజ్‌కుంద్రా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేసులో నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. అతని ఉద్యోగులు చెబుతున్న మాటలే సమస్యను తీవ్రం చేస్తున్నాయి.

Raj Kundra: పోర్న్ వీడియోలు డిలీట్ చేయమని చెప్పారంటోన్న ఉద్యోగులు

Raj Kundra

Raj Kundra: రాజ్‌కుంద్రా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేసులో నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. అతని ఉద్యోగులు చెబుతున్న మాటలే సమస్యను తీవ్రం చేస్తున్నాయి. రీసెంట్ గా పోర్నోగ్రఫిక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనే కేసులో ఇరుక్కున్న రాజ్‌కుంద్రాపై అతని ఉద్యోగులు పోర్న్ వీడియోలు డిలీట్ చేయాలని చెప్పినట్లు పోలీసులకు తెలిపారు.

అంతేకాకుండా ఆ క్లిప్‍‌లను ‘HotShots’ నుంచి అప్ లోడ్ చేసినట్లు కన్ఫామ్ చేశారు. దాంతో ఈ యాప్ కాంట్రవర్షియల్ కోణం తీవ్రమైంది.

ప్లాన్ బీ యాక్టివేట్
ప్రస్తుతం ఈ యాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్, ఆపిల్ స్టోర్ నుంచి తొలగించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు ప్లాన్ బీ యాక్టివేట్ చేసి Bollyfame యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిసింది.

పెద్ద మొత్తంలో డేటా డిలీట్
జులై 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన రాజ్ కుంద్రాను జులై 27న పోలీస్ కస్టడీకి పంపింది మెజిస్ట్రేట్ కోర్ట్. అతని అరెస్ట్ తర్వాతి రోజున పెద్ద మొత్తంలో డేటా డిలీట్ అయినట్లు రికార్డులు చెబుతున్నాయని పోలీసులు అంటున్నారు .

ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ.. పరారీలో ఉన్న యశ్ ఠాకూర్ అనే మరో నిందితుడి నుంచి లింకులు దొరికాయని చెప్పారు. ఆ క్లిప్పులను స్ట్రీమ్ చేసేందుకు యాప్ ప్రారంభించారని తెలిపారు.

భార్య పేరు మీద
అధికారుల సమచారాన్ని బట్టి మరో యాప్ ను యశ్ అతని భార్య పేరు మీద స్టార్ట్ చేశాడట. అందులో నుంచి ముందుగా అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలింస్ ను అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత పోర్న్ క్లిప్స్ అప్ లోడ్ చేశారని పోలీసులు కథనం.

రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. కామ ప్రేరణతో కూడిన వీడియోలే కానీ స్పష్టమైన లైంగిక చర్యలతో కూడిన వీడియోలు కాదని అన్నారు.

పోర్నోగ్రఫిక్ కంటెంట్ ప్రొడక్షన్‌లో
అతని భార్య శిల్పా శెట్టి పోలీసులతో మాట్లాడుతూ.. తన భర్తకు మొబైల్ యాప్ కంటెంట్ మీద పూర్తి అవగాహన లేదని పోర్నోగ్రఫిక్ కంటెంట్ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవలేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఎరోటికా, పోర్నోగ్రఫీకి తేడా ఉందని గట్టిగా వాదిస్తున్నారు.

రాజ్ కుంద్రా లాయర్, అబాడ్ పాండా.. కంటెంట్ పోర్నోగ్రఫీకి సంబంధించింది కాదని మిగిలిన నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫాంలలో కూడా ఇదే కంటెంట్ దొరుకుతుందని చెప్పారు.