Bengal Chief Secretary Quits : కేంద్రంతో మమత మళ్లీ పేచీ!

బెంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్​ బందోపాధ్యాయ్​ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్​ ఇచ్చారు మమతా బెనర్జీ.

Bengal Chief Secretary Quits : కేంద్రంతో మమత మళ్లీ పేచీ!

West Bengal Chief Secretary Quits Mamata Banerjee Appoints Him As Chief Advisor Amid Tussle With Centre

West Bengal Chief Secretary Quits బెంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్​ బందోపాధ్యాయ్​ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్​ ఇచ్చారు మమతా బెనర్జీ. బందోపాధ్యాయ్ పదవీకాలం పెంచకుండా..ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా హెచ్‌కే ద్వివేదిని నియమించారు. హోం శాఖ కార్య‌ద‌ర్శిగా బీపీ గోపాలిక‌ను నియ‌మించారు.

అలపన్ బందోపాధ్యాయను కేంద్ర సర్వీసులో చేరేందుకు సోమవారం ఉదయం ఢిల్లీకి రావాలని కేంద్రం పిలిచినప్పటికీ ఆయన వెళ్ల‌లేదు. కేంద్ర స‌ర్వీసుల‌కు తిరిగి రావడానికి నిరాకరించినందుకు కేంద్రం ఆయ‌న‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్రం ఈ చర్య తీసుకున్న కొద్ది నిమిషాల తర్వాత అల‌ప‌న్‌ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేయించి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియ‌మించి కేంద్రానికి దీదీ ఘాటుగా జ‌వాబిచ్చింది. దీంతో జూన్-1 నుంచి వచ్చే మూడేళ్ల పాటు బందోపాధ్యాయ్.. ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా కొనసాగుతారు.

వాస్తవానికి బంధోపాధ్యాయ్ మే-31న రిటైర్డ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ..కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం ఆరు నెలల పాటు పెంచాలని కోరుతూ ఈ నెల 10న సీఎం మమతాబెనర్జీ ప్రధానికి లేఖ రాశారు. మమత విజ్ణప్తిని ఆమోదించిన కేంద్రం…బందోపాధ్యాయ్ పదవీకాలాన్ని మూడు నెలలు(ఆగస్టు-30 వరకు) పొడిగిస్తూ ఈ నెల 24న ఆదేశాలిచ్చింది. అయితే యాస్ తుఫానుపై శుక్రవారం ప్రధాని మోడీ జ‌రిపిన రివ్యూ మీటింగ్ కి మమతా బెనర్జీ ఆలస్యంగా రావడం,ఆ తర్వాత వెంటనే మీటింగ్ నుంచి వెళ్లిపోవడాన్న తీవ్రంగా ప‌రిగ‌ణించిన కేంద్రం..బందోపాధ్యాయను రీకాల్ చేసింది. బందోపాధ్యాయ్‌ సేవలను ఉపయోగించుకోదలచామని..తక్షణమే ఆయనను రిలీవ్‌ చేయాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌లోపే ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే, బందోపాధ్యాయ బదిలీ ఏకపక్షమని..కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని..ఆయన రీలీవ్ చేసేది లేదంటూ సోమవారం ఉదయం ప్రదానికి మమత లేఖ రాశారు. అయితే మధ్యాహ్నాం మీడియాతో మాట్లాడిన మమత..బందోపాధ్యాయ పదవీకాలాన్ని పొడిగంచడం లేదని,ఆయన ఇవాళే ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్నార‌ని చెప్పారు. మీడియాకు చెప్పిన కొద్ది సేప‌టికే ఆయ‌న‌ను ప్ర‌ధాన స‌ల‌హాదారుగా నియ‌మించి కేంద్రానికి ఘాటుగా జ‌వాబిచ్చింది దీదీ.