బెంగాల్ ను విభజించాలని బీజేపీ చూస్తోంది : మమతా బెనర్జీ

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా బదులిచ్చారు. బెంగాల్‌లో మార్పు తెస్తామన్న ప్రధాని వ్యాఖ్యలపై మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయని... ఆరోపించారు.

బెంగాల్ ను విభజించాలని బీజేపీ చూస్తోంది : మమతా బెనర్జీ

west-bengal-cm-mamata-banerjee

Mamata angry over Modi’s comments : ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా బదులిచ్చారు. బెంగాల్‌లో మార్పు తెస్తామన్న ప్రధాని వ్యాఖ్యలపై మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయని… ఆరోపించారు. గ్యాస్‌, పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా బెంగాల్‌లోని సిలిగురిలో మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సామాన్యులకు గ్యాస్, ఇంధన ధరలు పెను భారంగా మారాయన్నారు.

బెంగాల్‌లో పరివర్తనం తెస్తానన్న పెద్దలు… ప్రజలే ఢిల్లీ ప్రభుత్వాన్ని పరివర్తన కల్పిస్తారూ చూస్కోండి అంటూ బదులిచ్చారు. ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. బెంగాల్ ను విభజించాలని బీజేపీ చూస్తోందన్నారు. దేశాన్ని మోడీ అమ్మకానికి పెట్టారని విమర్శించారు. త్వరలో ఢిల్లీలో మార్పు వస్తుందన్నారు.

అంతకముందు బెంగాల్ ప్రజల విశ్వాసాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం ముక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. కొల్‌కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో దీదీ ప్రభుత్వానికి ఓట్లు వేశారని… కానీ తృణమూల్‌ సర్కార్‌ మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.