Mamata Banerjee: రూల్స్ పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని, బైకు వెనుక సీట్లో కూర్చొని మమతా బెనర్జీ ప్రయాణం.. వీడియో

రెజ్లర్లకు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీలోనూ మమత పాల్గొన్నారు.

Mamata Banerjee: రూల్స్ పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని, బైకు వెనుక సీట్లో కూర్చొని మమతా బెనర్జీ ప్రయాణం.. వీడియో

Mamata Banerjee

Mamata Banerjee – Wrestlers: పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా(Kolkata)లో బైకు వెనుక సీట్లో కూర్చొని కొద్ది దూరం ప్రయాణించారు. ఆ సమయంలో రూల్స్ పాటిస్తూ ఆమె హెల్మెట్ కూడా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను అరెస్టు చేయాలంటూ భారత టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లకు ఇప్పటికే మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీలోనూ మమతా బెనర్జీ పాల్గొన్నారు.

మమతా బెనర్జీ బుధవారం కూడా రెజ్లర్లకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా రెజ్లర్లకు మద్దతు పెరుగుతోంది. లైంగిక వేధింపులకు గురైన రెజ్లర్లలో మైనర్ బాలిక ఉన్నప్పటికీ పోలీసులు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోవడంపై ఏంటని పలువురు నేతలు నిలదీస్తున్నారు.

ఏడుగురు మహిళా రెజ్లర్లు సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయలేదు. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కాబట్టి ఆయనను ఆ పార్టీ కాపాడుతోందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

Wrestlers: రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు దొరకలేదు.. ఇక కోర్టులో..: పోలీసు వర్గాలు