Mamata Banerjee : ఎమ్మెల్యేగా మమత ప్రమాణస్వీకారం అప్పుడే..టీఎంసీ క్లారిటీ

 ఇటీవల జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..గురువారం(అక్టోబర్-7,2021)ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.

Mamata Banerjee : ఎమ్మెల్యేగా మమత ప్రమాణస్వీకారం అప్పుడే..టీఎంసీ క్లారిటీ

Mamata (3)

Mamata Banerjee  ఇటీవల జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..గురువారం(అక్టోబర్-7,2021)ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని గవర్నర్‌ ను తాము అభ్యర్థించినట్లు ఆ రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీ సోమవారం తెలిపారు.

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతాబెనర్జీ..స్పల్ప తేడాతే బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని టీఎంసీ పార్టీ భారీ విజయాన్ని నమోదుచేయడంతో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ..వరుసగా మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు మమతాబెనర్జీ. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీఎంగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక అవ్వాల్సి పరిస్థితి మమతకు ఎదురైంది.

ఈ క్రమంలో భవనీపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే..మమత కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో భవానీపూర్ లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన మమతా బెనర్జీ..58,835 ఓట్ల మెజార్టీ భారీ విజయాన్ని నమోదుచేశారు. మమతకు 85,263 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌కు 26,428 ఓట్లు వచ్చాయి. మరోవైపు,భవానీపూర్ తో పాటు బెంగాల్ మరో రెండు నిమోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక జరిగగా..ఆ రెండు స్థానాల్లో కూడా టీఎంసీ అభ్యర్థులే గెలుపొందారు.

ALSO READ Pandora Papers : పండోరా పేపర్స్ లోని భారతీయులపై మోదీ సర్కార్ దృష్టి..దర్యాప్తుకి ఆదేశాలు