చెట్టు మా సోదరుడు : వినూత్నంగా ‘భాయీ దూజ్’ ఉత్సవం 

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 08:28 AM IST
చెట్టు మా సోదరుడు  : వినూత్నంగా ‘భాయీ దూజ్’ ఉత్సవం 

దీపావళి పండుగకు భాయీ దూజ్ వేడుకలను ఉత్తరాదిలో ఘనంగా చేసుకుంటారు. రాఖీ పండుగను గుర్తు చేసే ఈ వేడుకను పర్యావరణ హితంగా జరుపుకున్నారు పశ్చి బెంగాల్ లో. చెట్టునే సోదరుడి అంటే తోడబుట్టిన అన్నలా..తమ్ముడిలా భావించి ‘భాయీ దూజ్’ ఉత్సవాన్ని వినూత్న రీతిలో నిర్వహించుకున్నారు. 

ప్రముఖ పర్యావరణవేత్త సుభాష్ దత్ నేతృత్వంలో హౌరాలోని తెల్కల్ ఘాట్ దగ్గర ఉన్న ఓ చెట్టు సమీపంలో భాయూదూజ్ వేడుకలు నిర్వహించారు స్థానిక మహిళలు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మహిళలు తమ సోదరుడికి ‘భాయీ దూజ్‘ పండుగ సందర్భంగా చేసిన అన్ని పద్ధతులను చేశారు. ఆ  చెట్టుకు బొట్టుపెట్టి, హారతులిచ్చారు. అంతేకాదు ప్రత్యేక పూజలు చేశారు.  ఆ చెట్టునే తమ సోదరునిగా భావించి..చెట్టు దీర్ఘాయువు కలగాలని..ఎప్పుడు పచ్చగా కళకళలాడుతు ఉండాలని ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా సుభాష్ దత్ మాట్లాడుతూ స్థానికులను పర్యావరణ పరిరక్షణ విషయంలో మరింత చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అభివృద్ధి పేరుతో చెట్లను నరికితే ఊరుకోమని అన్నారు. కాగా ఐదు రోజుల దీపావళి పండుగ ఈ భాయీ దూజ్ ఉత్సవంతో ముగిస్తారు ఉత్తరాదివారు. ఈ సందర్భంగా చెట్టునే తమ తోడబుట్టివారిగా భావించి వినూత్నరీతిలో ఈ వేడుకను నిర్వహించారు.