West Bengal govt: కొవిడ్ నిబంధనలను పొడిగించిన బెంగాల్ గవర్నమెంట్.. కొత్త రూల్స్ ఇవే

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 2కోట్ల మంది వరకూ వ్యాక్సిన్ వేయించాం. ప్రత్యేకించి సూపర్ స్ప్రెడర్స్ లాంటి గ్రూపులకు ప్రాధాన్యత ఇచ్చామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీడియా సమావేశంలో అన్నారు.

West Bengal govt: కొవిడ్ నిబంధనలను పొడిగించిన బెంగాల్ గవర్నమెంట్.. కొత్త రూల్స్ ఇవే

Mamata Benerjee

West Bengal govt: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 2కోట్ల మంది వరకూ వ్యాక్సిన్ వేయించాం. ప్రత్యేకించి సూపర్ స్ప్రెడర్స్ లాంటి గ్రూపులకు ప్రాధాన్యత ఇచ్చామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీడియా సమావేశంలో అన్నారు.

దాంతో పాటు వన్ నేషన్ వన్ రేషన్ స్కీంను కూడా రాబోయే మూడు నెలల్లో పశ్చిమ బెంగాల్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. పని జరుగుతూ ఉంది. ఆధార్ వెరిఫికేషన్ మాత్రమే మిగిలి ఉంది. మూడు నెలల్లోగా పూర్తి చేసేస్తామని మమతా అన్నారు.

హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం.. ఆదివారం నాటికి యాక్టివ్ కేసులు 17వేల 651గా ఉన్నాయి. రాష్ట్రంలో కేసుల ఫెటాలిటీ రేట్ 1.16శాతం ఉంది. అదే సమయంలో రికవరీ రేట్ 97.64శాతంగా ఉంది.

నైట్ కర్ఫ్యూ;
కొత్త రూల్స్ ప్రకారం.. నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. దానిని బట్టి రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ రాకపోకలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలు తప్పించి మిగతా కదలికలకు పర్మిషన్ ఇవ్వలేదు.

కొత్త రూల్స్ ప్రకారం..:
*అన్ని అంతర్రాష్ట్ర బస్సులు, ట్రైన్ సర్వీసులు, నీటి గుండా రవాణాను రద్దు చేశాం. ఎమర్జెన్సీ కేసుల్లో మాత్రమే ప్రైవేట్ వెహికల్స్, క్యాబ్స్ కు అనుమతి ఇస్తాం.
*కస్టమర్ల కోసం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ బ్యాంకులు పనిచేస్తాయి.
*జూన్ 16నుంచి అన్ని గవర్నమెంట్ ఆఫీసులు 25శాతం స్టాఫ్ తో ఓపెన్ చేసుకోవచ్చు.
*ప్రైవేట్, కార్పొరేట్ ఆఫీసులు కూడా 25శాతం కెపాసిటీతో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ ఓపెన్ గా ఉంచుకోవచ్చు. కాకపోతే ఆ ఉద్యోగులకు ఈ పాసులు ఉండాలి.
*ఉదయం 6నుంచి 9గంటల వరకూ ప్రతి రోజూ పబ్లిక్ పార్కులు ఓపెన్ గా ఉంటాయి. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే పార్కుల్లోకి అనుమతి ఉంది.
*బజార్లు, మార్కెట్లు ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకూ ఓపెన్ గా ఉంటాయి. అదే సమయంలో ఇతర రిటైల్ షాపులు కూడా 11గంటల నుంచి 6గంటల వరకూ ఓపెన్ చేసి ఉంచుకోవచ్చు.
*రెస్టారెంట్లు, బార్లు 12గంటల నుంచి రాత్రి 8గంటల మధ్యలో 50శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేస్తాయి.
*స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలను మూసే ఉంచుతారు. జిమ్స్, బ్యూటీ పార్లర్లు, సినిమా హాల్స్ కు కూడా ఇదే పరిస్థితి.