మళ్లీ లాక్ డౌన్ పొడిగింపు..ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..దురంతో ఎక్స్ ప్రెస్ రద్దు

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 07:04 AM IST
మళ్లీ లాక్ డౌన్ పొడిగింపు..ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..దురంతో ఎక్స్ ప్రెస్ రద్దు

కరోనా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతూనే ఉన్నాయి. లక్షల వరకు కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం మొదలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి.

మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇలాగే..వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో కరోన వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కట్టడి లక్ష్యంగా పనిచేయాలని, అందులో భాగంగా..మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ వారంలో రెండు రోజు పాటు లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే.



ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని సీఎం మమత బెనర్జీ వెల్లడించారు. అయితే..ఆగస్టు 01వ తేదీన బక్రీద్ పర్వదినం ఉండడంతో ఆ రోజు లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో…సికింద్రాబాద్ నుంచి వెళ్లిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం భువనేశ్వర్ లో నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

2020, జులై 30వ తేదీ బుధవారం భువనేశ్వర్ నుంచి బయలుదేరుతుందని, అలాగే..కోల్ కత నుంచి బుధవారం బయలుదేరాల్సిన దురంతో ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.



ఇక కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే…బెంగాల్ లో 2020, జులై 28వ తేదీ.. మంగళవారం..2 వేల 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా..వైరస్ బారిన పడిన వారి సంఖ్య…60 వేల 830కి చేరాయి. వీరిలో 39 వేల 917 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1411 మంది చనిపోయారు. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో 19 వేల 502 యాక్టివ్ కేసులున్నాయి.

లాక్ డౌన్ ఉండే రోజులు : –
July 29, Wednesday
August 2, Sunday
August 5, Wednesday
August 8, Saturday
August 9, Sunday
August 16, Sunday
August 17, Monday
August 23, Sunday
August 24, Monday
August 31, Monday