Nurse Lipika Debnath : చేసేది నర్సు ఉద్యోగం..కానీ బాడీబిల్డింగులతో అదరగొట్టేస్తోంది..ఎందుకంటే

చేసేది నర్సు ఉద్యోగం. కానీ బాడీ బిల్డింగులతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బెంగాల్ కు చెందిన నర్సు లిపిక దేబ్‌నాథ్. మాల్దాకు చెందిన 25 ఏళ్ల లిపిక చేసేది నర్సు ఉద్యోగమే అయినా రోజుకు 150 కిలోమీటర్లు బస్సులో ప్రయాణిస్తూ..విధులు నిర్వహిస్తోంది. లిపిక నర్సు ఉద్యోగం చేస్తున్నా క్రీడలు అంటే మహాఇష్టం. ఒలింపిక్స్ లో పాల్గొనాలని..పతకాలు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

Nurse Lipika Debnath passionate bodybuilder training for Olympics : చేసేది నర్సు ఉద్యోగం. కానీ బాడీ బిల్డింగులతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బెంగాల్ కు చెందిన నర్సు లిపిక. పూర్తి పేరు లిపిక దేబ్‌నాథ్. మాల్దాకు చెందిన 25 ఏళ్ల లిపిక చేసేది నర్సు ఉద్యోగమే అయినా రోజుకు 150 కిలోమీటర్లు బస్సులో ప్రయాణిస్తూ..విధులు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రిలో తన డ్యూటీ ముగించుకుని కోచ్ పింకూ భగత్ సహాయంతో బాడీబిల్డింగ్ కసరత్తులు చేస్తోంది. లిపిక నర్సు ఉద్యోగం చేస్తున్నా క్రీడలు అంటే మహాఇష్టం. ఒలింపిక్స్ లో పాల్గొనాలని..పతకాలు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్న లిపిక గత ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో ఆరోస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. డ్యూటీ ధలాయ్‌ జిల్లాలోని సలేమా గ్రామానికి చెందిన లిపిక నర్సుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి, 2020లో మాల్డాలోని చంచల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి విధుల్లో చేరింది. రోజూ ఉదయం చంచల్‌లో బస్సు ఎక్కి మాల్డాకు వచ్చి.. కోచ్‌ పింకు భగత్‌ ఆధ్వర్యంలో కొన్ని గంటలపాటు ట్రైనింగ్ తీసుకుంటోంది.

ఆ తర్వాత తిరిగి చంచల్‌కు వెళ్లి ఆసుపత్రిలో సేవలందిస్తుంది. గత నెల పుణెలో జరిగిన అంతర్జాతీయస్థాయి మిస్టర్‌ అండ్‌ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. లిపిక తండ్రి రిటైర్డ్‌ టీచర్‌. చిన్నప్పుడు తండ్రే తనను జిమ్‌కు తీసుకువెళ్లేవారని చెబుతోంది లిపిక మాట్లాడుతూ..”నేను చేసే పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను. నేను నా డ్యూటీని నిర్వర్తిస్తున్నప్పుడు, నేను దానిపై పూర్తిగా దృష్టి పెడతాను. నా డ్యూటీ ముగిసాక ఒలింపిక్స్ లో పాల్గొనాలనే ఆకాంక్షతో జిమ్‌ లో నా కోచ్ సహాయంతో కసరత్తులు చేస్తుంటాను అని తెలిపింది.

ఇలా నేను నా నర్సు డ్యూటీని మనస్సు పెట్టి చేస్తాను. అలాగే కసరత్తులు కూడా అంతే అంకిత భావంతో చేస్తాను. ఇలా రెండు పనుల్ని ఏకాగ్రతతోనే చేస్తాను అని తెలిపింది. నేను ఎప్పుడూ వ్యాయామం చేయడాన్ని ఇష్టపడతాను. ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించటమే నా లక్ష్యంగా జీవిస్తున్నాను అని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు