West Bengal : ఎండ వేడితో ఆమ్లెట్, పాప్ కార్న్ వండేస్తున్న వెస్ట్ బెంగాల్ జనం.. ఎండలు మామూలుగా లేవుగా..

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు జనాన్ని భయపెడుతున్నాయి. ఎండ తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో వెస్ట్ బెంగాల్‌లో ఓ వ్లాగర్ చేసిన వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

West Bengal : ఎండ వేడితో ఆమ్లెట్, పాప్ కార్న్ వండేస్తున్న వెస్ట్ బెంగాల్ జనం.. ఎండలు మామూలుగా లేవుగా..

West Bengal

West Bengal :  దేశ వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వడగాల్పులు తట్టుకోలేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. టెర్రస్‌పై ఎండలో కూర్చుని ఆమ్లెట్, పాప్ కార్న్ ఏమి కావాలన్నా వండేస్తున్నారు జనం.

హైదరాబాద్ వేసవికాలం వేడి కరోనాను అడ్డుకోగలదా?

పశ్చిమబెంగాల్‌లో (west bengal) మూడు రోజులుగా ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కి రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు స్కూళ్లు, కాలేజీలు కూడా మూతపడ్డాయి. బయటకు వెళ్లలేని ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్లాగర్ (vlogger) చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటి టెర్రస్ (terrace) మీద కేవలం ఎండ వేడితో ఆమ్లెట్ (omelette )వేసేస్తున్నాడు. పాప్‌కార్న్ (Popcorn) ప్రిపేర్ చేస్తున్నాడు. పాన్ మీద గుడ్డుని పగలగొట్టి నూనె వాడకుండానే కేవలం ఎండ వేడితో ఆమ్లెట్ చేసేసాడు. అలాగే పాప్ కార్న్ కూడా. ఇక ఎండ వేడికి ఆమ్లెట్ బాగానే ఉడికింది. పాప్ కార్న్ కూడా చక్కగా రెడీ అయ్యింది. ఇక వాటినీ టేస్ట్ చేస్తూ అద్భుతంగా ఉన్నాయని వివరించాడు ఆ వ్లాగర్.

Stay Cool At Home : వేసవిలో ఏసీ లేకుండా ఇంట్లో కూల్‌గా ఉండటం ఎలాగంటే?

ఏప్రిల్ 9న వ్లాగర్ ఈ వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగానే లక్షల సంఖ్యలో జనం వీక్షించారు. మేము ఇలా చేయడానికి ప్రయత్నం చేసామని చాలామంది రిప్లై చేశారు. ఇక ఎండ తీవ్రత ఎంత ఉందో అర్ధమవుతోంది కాబట్టి జనం తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది.