Omicron In Bengal : బెంగాల్ లో తొలి ఒమిక్రాన్ కేసు..ఏడేళ్ల బాలుడికి పాజిటివ్

దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన

Omicron In Bengal : బెంగాల్ లో తొలి ఒమిక్రాన్ కేసు..ఏడేళ్ల బాలుడికి పాజిటివ్

Bengal 12

Omicron In Bengal :  దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన 7 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఆ బాలుడు తన పేరెంట్స్‌తో కలిసి అబుదాబీ నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడని,అక్కడ చేసిన కరోనా పరీక్షలో పాటిజివ్‌గా తేలిందన్నారు.

అయితే బాలుడి తల్లిదండ్రులకు కరోనా టెస్ట్‌లో నెగిటివ్‌ వచ్చిందన్నారు. అతడు తన పేరెంట్స్‌తో కలిసి బెంగాల్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఆ బాలుడికి ఒమిక్రాన్‌ సోకినట్లుగా బుధవారం నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో ముర్షిదాబాద్ జిల్లాలోని హాస్పిటల్ లో ఆ బాలుడిని చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు బెంగాల్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ALSO READ తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం..హైదరాబాద్‌‌లో రెండు కేసులు