Chandana Bauri won : బెంగాల్లో బీజేపీ ఓడినా..విజయం సాధించిన సాధారణ మహిళ..

Chandana Bauri won : బెంగాల్లో బీజేపీ ఓడినా..విజయం సాధించిన సాధారణ మహిళ..

Chandana Bauri Won

Bengal Elections Chandana Bauri won : ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటానికి అటు టీఎంసీ, ఇటు బీజేపీ హోరా హోరీగా తలపడ్డాయి. కాని చివరికి విజయం టీఎంసీకే దక్కింది. సీఎం మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువెందు చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా సీఎం పీఠాన్ని మరోసారి దక్కించుకున్న బెంగాల్ టైగర్ గా దీదీ ఘతన సాధించారు. బీజేపీ దీదీ చేతిలో ఓడినా గతం కంటే సీట్లు ఎక్కువగా సాధించటం గమనించాల్సిన విషయం. కానీ ఎన్ని సీట్లు దక్కించుకున్నా..విజయం మాత్రం టీఎంసీకే దక్కింది. ఈ క్రమంలో ఓ సామన్య మహిళ..రెక్కల కష్టం చేస్తేనే గానీ రోజు గడవని ఓ అత్యంత సాధారణ మహిళ మాత్రం బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించటం..ఊహించన విజయాన్ని దక్కించుకోవటంతో చాలా ఆసక్తికరంగా మారింది. ఆమే బీజేపీ మహిళా అభ్యర్థి చందనా బౌరి.

బీజేపీ తరపున సాల్తోరా సీటు నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చంద‌నా బౌరీ…. టీఎంసీ అభ్య‌ర్థి సంతోష్ మండ‌ల్‌ను ఓడించారు. చంద‌నా బౌరీ విజ‌యం క‌న్నా ఆమె జీవ‌న స్థితిగ‌తులు, ఆర్థిక ప‌రిస్థితులు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన చందనా బౌరి మీద ఎటువంటి అంచనాలు లేవు. బీజేపీ కావాలనే సింపతీ కోసం ఫోకస్ కోసం ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిందనే అన్నారు. కానీ పని మనిషిగా జీవనం సాగించే చందనా బౌరి మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా విజయం సాధించటంలో ఇప్పుడు పెద్ద ఆసక్తికరంగా మారింది. బెంగాల్ ఎన్నికల్లో ఆమె పేరు మారుమోగిపోతోంది. ఆమె టీఎంసీ అభ్యర్థి సంతోష్ కుమార్ మండల్‌పై 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. దీంతో చందనా బౌరికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చందనా బౌరి కుటుంబం జీవించేది ఓ పూరి గుడిసెలో. 12 వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుకోగా..ఎనిమిదవ తరగతి చదువుకునే భర్త తాపీ పనులు చేస్తుంటాడు. వారికి ముగ్గురు పిల్లలు. వారికి మూడు మేకలు, మూడు ఆవులు ఉన్నాయి. ఇటువంటి అత్యంత సాధారణ జీవితం గడిపే చందనా బౌరిని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఆమెపై జనాల్లోగానీ..నేతల్లో గానీ ఎటువంటి అంచనాలు లేవు..అయినా ఆమె విజయం సాధించటం గమనించాల్సిన విషయం. పెద్ద పెద్ద నేతలే పరాజయం పొందిన క్రమంలో చందనా బౌరి విజయం మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాల్సిందే.