భారత్ బంద్ : హెల్మెట్ పెట్టుకుని బస్సు నడిపిన డ్రైవర్ 

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 04:12 AM IST
భారత్ బంద్ : హెల్మెట్ పెట్టుకుని బస్సు నడిపిన డ్రైవర్ 

కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. భారత్‌బంద్ సందర్భంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఓ డ్రైవర్ తన నిరసనను వినూత్నంగా తెలిపారు.  ఉత్తర బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ (ఎన్‌బిఎస్‌టిసి) బస్సు డ్రైవర్ హెల్మెట్ హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతు నిరసన తెలిపాడు. 

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి కేంద్ర కార్మిక సంఘాలు. ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ సమ్మెకు INTUC, AITUC, CITU, TUCC సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందని, దీంతో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు 10 కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. తమ డిమాండ్ల జాబితాపై చర్యలు తీసుకోవాలని యూనియన్లు పిలుపునిస్తున్నాయి.

విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా ఇవాళ పలు రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాంక్‌ యూనియన్లు ముందుగానే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి.  కేంద్రం ఇప్పటికే దేశంలోని 12 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.