బెంగాల్ ఎన్నికల ముందు టీఎంసీలోకి బీజేపీ మాజీ లీడర్

కేంద్ర మాజీ మంత్రి, అటల్ బీహార్ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొద్ది వారాల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

బెంగాల్ ఎన్నికల ముందు టీఎంసీలోకి బీజేపీ మాజీ లీడర్

Tmc Yaswanth

West Bengal: కేంద్ర మాజీ మంత్రి, అటల్ బీహార్ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొద్ది వారాల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 83ఏళ్ల ఈ సీనియర్ నాయకుడు 2018లోనే బీజేపీకి వీడ్కోలు చెప్పేశారు. ప్రస్తుతం ఆయన చేరిక పార్టీ నాయకురాలు.. సీఎం మమతా బెనర్జీకి బలం చేకూరినట్లు అని అంటున్నారు.

పార్టీలో కలిసేముందు మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిశారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడిన ఆయన ప్రధాని మోడీని, మాజీ ప్రధాని వాజ్ పేయితో పోల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఆందోళనలపై మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఒక్క మార్పుతో ఆపలేం. అటల్ గారు ఏకాభిప్రాయాన్ని నమ్మేవారు ఈ ప్రభుత్వం బలవంతాన్ని నమ్ముతుంది. అటల్ గారు సహ ఎంపికను నమ్మేవారు ఈ ప్రభుత్వం గెలవడాన్ని నమ్ముతుంది. అటల్ గారు జాతీయ కూటమి నిర్మించారు. ఆయనెప్పుడూ అవి బలహీనపడాలని అనుకోలేదు’ అని సిన్హా అన్నారు.

బుధవారం సాయంత్రం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో జరిగిన తోపులాటలో గాయపడి కోల్ కతాలోని ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..హాస్పిటల్ నుంచి తృణముల్ పార్టీ కార్యకర్తలకు సందేశమిచ్చారు. ఈ మేరకు మమత ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను నిన్న సాయంత్రం కారు దగ్గర నిలబడి ఉన్నప్పుడు తనను కొందరు తోసేయడం జరిగిందని మమత ఆ వీడియోలో తెలిపారు.

దాడి సమయంలో తన చుట్టూ భద్రతా సిబ్బంది ఎవరూ లేరని మమత తెలిపారు. తన కాలు నలిగిపోయిందని మమత తెలిపారు. ఛాతి భాగంలో చిన్న చిన్న గాయాలున్నాయని తెలిపారు. ఎడమ కాలి మడియ భాగంలో నొప్పిగా ఉందన్నారు. తీవ్రమైన తలనొప్పి,గుండెలో కాస్త పెయిన్ గా ఉందన్నారు. టీఎంసీ కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని మమత పిలుపునిచ్చారు.

ఏ ఒక్కరికీ అసౌకర్యం కలిగేలా ఎలాంటి పనులు చేయవద్దని సూచించారు. తాను రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ పని ప్రారంభిస్తాను అని ఆమె తెలిపారు.