Brij Bhushan Sharan Singh: ఉరేసుకుని చచ్చిపోతా.. రెజ్లర్ల ఆరోపణపై బ్రిజ్ భూషణ్ హాట్ కామెంట్స్

రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ విరుచుకుపడ్డారు. మెడల్స్‭ను గంగలో విసిరేస్తామని వెళ్లిన వారు, వాటిని తికాయత్‭కు ఎందుకు ఇచ్చారని విమర్శించారు. మరో ఐదు రోజుల సమయంతో విరమణ తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆటగాళ్లు తమ పథకాలను గంగలో విసిరేయాలనుకుంటే తామేం చేయగలమంటూ స్పందించారు

Brij Bhushan Sharan Singh: ఉరేసుకుని చచ్చిపోతా.. రెజ్లర్ల ఆరోపణపై బ్రిజ్ భూషణ్ హాట్ కామెంట్స్

Wrestlers protest: రెజ్లర్లు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిజమని తేలినా తాను ఉరేసుకుని చచ్చిపోతానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ అన్నారు. బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలలుగా తన రాజీనామాను డిమాండ్ చేస్తున్నారని, అయితే రాజీనామా చేసేందుకు నాలుగు నెలలుగా తనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని, ఒకవేళ నిజమే అయితే ఎందుకు నిరూపించలేకపోతున్నారని బ్రిజ్ భూషణ్ అన్నారు.

Go Back Modi: ‘మోదీ గో బ్యాక్’.. రాజస్థాన్ పర్యటన సందర్భంగా విరుచుకుపడుతున్న నెటిజెన్లు

కాగా, దీనికి ముందు రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ విరుచుకుపడ్డారు. మెడల్స్‭ను గంగలో విసిరేస్తామని వెళ్లిన వారు, వాటిని తికాయత్‭కు ఎందుకు ఇచ్చారని విమర్శించారు. మరో ఐదు రోజుల సమయంతో విరమణ తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆటగాళ్లు తమ పథకాలను గంగలో విసిరేయాలనుకుంటే తామేం చేయగలమంటూ స్పందించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా చీఫ్ ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని, ఇక ఆయన ఆ స్థానంలో ఉండి ఏం లాభం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Maharashtra Politics: దేవేంద్ర ఫడ్నవీస్‭ పరిస్థితి కమిషనర్ నుంచి కానిస్టేబుల్‭కు దిగజారిందట!

ఇంతకు ముందు పలుమార్లు రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆందోళన చేస్తూ కొత్తగా రెజ్లింగులోకి వచ్చే వారిని భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తూన్నారంటూ మండిపడ్డారు. రెజ్లర్ల నిరసన వల్ల తమకేం పోయేదేమీ లేదంటూ సైతం వ్యాఖ్యానించారు. ఇక తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “రెజ్లర్లు తమ పతకాలను గంగలో ముంచడానికి వెళ్లారు. కానీ ఆ పని చేయడానికి బదులు, వారు తమ పతకాల్ని రాకేశ్ తికాయత్‭కు ఇచ్చారు. అది వారి స్టాండ్. మనం ఏమి చేయగలం?” అని అన్నారు.