Saharanpur City : సుందర దృశ్యం…హిమాలయ శిఖరాల కనువిందు

Saharanpur City : సుందర దృశ్యం…హిమాలయ శిఖరాల కనువిందు

What A Fabulous View Of Snow Clad Upper Himalayas Saharanpur City

Uttar Pradesh : సుందర దృశ్యం సాక్షాత్కారమైంది. హిమాలయ శిఖరాలు కనువిందు చేశాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్ పూర్ పట్టణ వాసులకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సంవత్సరం వరుసగా రెండో సారి హిమాయల పర్వతాలు కనిపించాయి. ట్విట్టర్ వేదికగా Sanjay Kumar. IAS ట్వీట్ చేశారు. సహారాన్ పూర్ నుంచి అప్పర్ హిమాలయాలకు దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుందని ఆయన వెల్లడించారు.

తౌక్టే తుఫాన్ కారణంగా ఉత్తర భారతదేశంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీని కారణంగా…మంచు తొలగి హిమాలయ పర్వతాలు కనిపించాయని అంటున్నారు. అంతేగాకుండా..కరోనా వైరస్ కారణంగా..పలు నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నాయి పలు రాష్ట్రాలు. దీంతో కాలుష్యం విపరీతంగా తగ్గడం కూడా కారణమని వెల్లడిస్తున్నారు.

సంజయ్ కుమార్ ఐఏఎస్ కు ఫొటోగ్రఫిపై  మంచి అభిరుచి ఉంది. ఇతను యూపీ క్యాడర్ కు చెందిన వారు. ఇక వైద్యుడు వివేక్ బెనర్జీ కూడా హిమాలయాలను తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయంతో తెగ వైరల్ గా మారింది.

Read More : Reserve Bank: కేంద్రానికి రూ. 99వేల కోట్లు.. ఆర్‌బీఐ ఆమోదం