Neeraj Chopra :కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో నీర‌జ్ చోప్రా సందడి‌..బిగ్ బీ ఎక్సైట్మెంట్ గా ఏమడిగారంటే..

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో నీర‌జ్ చోప్రా సందడి‌ చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ హోస్ట్ బిగ్ బీ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతు నీరజ్ చోప్రాను అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

10TV Telugu News

Neeraj Chopra in kaun banega karodepathi program :  టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించి చ‌రిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా బిగ్ బి షో..కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ ప్రోగ్రామ్ కు స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన నీరస్ చోప్రాను చూసిన బిగ్ బీ చాలా ఆనందం వ్యక్తంచేశారు. ఆ తరువాత నీరజ్ చేతిలోని గోల్డ్ మెడల్ చూసిన బిగ్ బీ చిన్నపిల్లాడిలా ఓ ప్రశ్న అడిగారు.. ఆ ప్రశ్న ఏంటీ అని తెలుసుకునే ముందు నీరజ్ చోప్రాతో పాటు ఈ ప్రోగ్రామ్ కు మరో క్రీడాకారుడు కూడా వచ్చిన విషయం తెలుసుకోవాలి.

అతనే బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన హాకీ టీమ్ గోల్ కీప‌ర్ పీఆర్ శ్రీజేష్. షాన్‌దార్ శుక్ర‌వార్ పేరుతో శుక్ర‌వారం (సెప్టెంబర్ 17,2021)రాత్రి ఈ స్పెష‌ల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. ఈ ప్రోగ్రామ్‌లో ఈ ఇద్ద‌రు అథ్లెట్ల‌ను బిగ్ బీ సాదరంగా ఆహ్వానిస్తూ షో హోస్ట్‌, బాలీవుడ్ షెహ‌న్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ చాలా గొప్ప‌గా..అబ్బురంగా ప‌రిచ‌యం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.

Read more : KBC: కోటి గెలిచిన అంధురాలి కథ.. విధిని జయించిన స్ఫూర్తి గాథ!

ఈ సందర్భంగా వారిద్దరిని బిగ్ బి ఓ ప్రశ్న వేశారు.ఆ ప్రశ్న ఎలా ఉందంటే..ఓ చిన్నపిల్లాడు ఎక్సైట్మెంట్ ఫీల్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. వారిద్దరినీ బిగ్ బీ ‘‘మిమ్మ‌ల్ని ఓ ప్ర‌శ్న అడ‌గొచ్చా? ఈ మెడ‌ల్‌ను నేను ట‌చ్ చేయొచ్చా అని అడిగాడు. దానికి వెంటనే ఆ ఇద్ద‌రూ త‌మ మెడ‌ల్స్‌ను బిగ్ బీ చేతుల్లో పెట్టారు.దీనికి బిగ్ బీ స్పందిస్తూ.. వాటిని చేతుల్లోకి తీసుకుంటూ..‘ హా నేను ఇవి చాలా బ‌రువున్నాయి, బాగున్నాయి‘ అని అమితాబ్ అన్నారు ఏదో అద్భుతాన్ని చేత్తో తాకినట్లుగా. ‘లేదు, లేదు నేను దీనిని మెడ‌లో వేసుకోను..నా జీవితంలో ఇలాంటివి వేసుకునే అవ‌కాశం దొర‌క‌దు. వీటిని చేత్తో తాకితే చాలు.. మాకు అదే ఎక్కువ’ అని అన్నారు. అంటే వాటికి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు.

త‌న సినిమా డైలాగ్‌ల‌ను హ‌ర్యాన్వీలోకి త‌ర్జుమా చేసి చెప్పాల‌ని బిగ్ బీ కోరగా..నీర‌జ్ కూడా చాలా ఉత్సాహంగా అలాగే చేసి న‌వ్వించాడు. అలా ముగ్గురు కలిసి హాయిగా ప్రోగ్రామ్ ను కొనసాగించినట్లుగా తెలుస్తోంది ఈ ప్రోమో చూస్తుంటే. అంతేకాదు సెట్స్‌లోనే జావెలిన్ ఎలా విస‌రాలో, హాకీ ఎలా ఆడాలో ఈ ఇద్ద‌రి నుంచీ మెళ‌కువ‌లు నేర్చుకున్నారు బిగ్ బీ. ఇక ఈ ప్రోగ్రామ్ ద్వారా నీర‌జ్ చోప్రా.. త‌న స‌క్సెస్ స్టోరీని వివ‌రించాడు.

Read more : KBC 12 : కరోడ్ పతి నాజియా నాసిమ్

కాగా ఈ ప్రోగ్రామ్ చాలా స‌ర‌దాగా సాగిన‌ట్లు ప్రోమో చూస్తే తెలిసిపోతోంది. ప్రేక్షకులు కూడా ఈ ప్రోగ్రామ్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ పక్క బిగ్ బి సరదా సరదా మాటలు..మరో పక్క బంగారు కొండ నీరజ్ చోప్రా ఆటల విశేషాలతో వెరసి ఈ ఎపిసోడ్ చూడటానికి అభిమానులు చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ మరో కొన్ని గంటల్లో రానుంది.