విమాన బ్లాక్‌బాక్స్‌తో ఏం తెలుస్తుంది?

  • Edited By: bheemraj , August 8, 2020 / 09:20 PM IST
విమాన బ్లాక్‌బాక్స్‌తో ఏం తెలుస్తుంది?

కేర‌ళ‌లోని కోజికోడ్‌లో విమానం కూలిన ఘ‌ట‌న తెలిసిందే. విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోజికోడ్‌ విమనాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురైంది.

అయితే ఆ ఎయిర్ ఇండియా విమాన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌బాక్స్‌లో డిజిట‌ల్ ఫ్ల‌యిట్ డేటా రికార్డ‌ర్‌(డీఎఫ్‌డీఆర్‌)తో పాటు కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్‌లు ఉంటాయి. ఈ రెండింటిని ప్ర‌మాద స్థలం నుంచి సేక‌రించారు. డేటా, కాక్‌పిట్ రికార్డ‌ర్ల‌తో.. విమానం ఎలా, ఎందుకు కూలింద‌న్న అంశాల‌ను తేల్చే అవకాశం ఉంటుంది. డేటా, కాక్‌పిట్‌ల్లో చిన్న చిప్స్ ఉంటాయి. ఆ ప‌రిక‌రాలు వంద‌ల సంఖ్య‌లో డేటాను సేక‌రిస్తుంటాయి.

విమాన ప‌ర్ఫార్మెన్స్‌కు సంబంధించి వివరాలు వాటిల్లో ఉంటాయి. స్పీడ్‌, హైట్‌, రేట్ ఆఫ్ క్లైంబ్ ఆర్ డిసెంట్‌, ఫ్ల‌యిట్ పాత్‌, లొకేష‌న్‌, ఫుయ‌ల్ లెవ‌ల్స్‌, ఇంజిన్ టెంప‌రేచ‌ర్‌, ఎగ్జాస్ట్‌, ఫ్లాప్ పొజిష‌న్ లాంటి అంశాల‌ను స్ట‌డీ చేసే వీలు ఉంటుంది. వీటితో పాటు ఇత‌ర విమాన వ్య‌వ‌స్థ‌లు ఎలా ప‌నిచేస్తున్నాయ‌న్న విష‌యాలు కూడా తెలుస్తాయి.

కాక్‌పిట్ డేటా ఆధారంగా నిపుణులు ప్ర‌మాద కార‌ణాల‌ను అంచ‌నా వేస్తారు. ఎందుకు విమానం ప్ర‌మాదానికి గురైంది, ఎంత తీవ్ర‌త‌తో ఆ ప్ర‌మాదం జ‌రిగింద‌న్న అంశాలను వెల్ల‌డించేందుకు బ్లాక్‌బాక్స్ డేటా చాలా ఉప‌క‌రిస్తుంది. ప్ర‌మాదం గురించి పూర్తిగా చెప్పాలంటే, ముందు ద‌ర్యాప్తు అధికారులు ఆ ప్ర‌మాద కార‌ణాల‌ను విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.

అయితే కాక్‌పిట్ డేటా రికార్డర్ల‌లో ఉన్న స‌మాచారం మేర‌కే విమాన ప్ర‌మాదం గురించి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ్లాక్‌బాక్స్‌ను అధ్య‌య‌నం చేసే ప్ర‌త్యేక ఏజెన్సీలు కొన్నే ఉన్నాయి. వాస్త‌వానికి చాలా ర‌కాల ప‌ద్ధ‌తుల్లో బ్లాక్‌బాక్స్‌ను స్ట‌డీ చేసే విధానాలు ఉన్నాయి.

అయితే ప‌శ్చిమ దేశాలే దీంట్లో దిట్ట‌. ప్ర‌త్యేక లేబ‌రేట‌రీల ద్వారా కూడా బ్లాక్‌బాక్స్‌ను అధ్య‌య‌నం చేసే వీలు ఉంటుంది. కేర‌ళ క‌రిపుర్ విమాన ఘ‌ట‌న‌లో మొత్తం 23 మంది మృతి చెందారు. డేటా రికార్డ‌ర్‌, కాక్‌పిట్ రికార్డ‌ర్లను ఏఏఐబీ విచారిస్తున్న‌ట్లు విమానాయాన‌శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి పేర్కొన్నారు.