Rahul Gandhi: 16కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ

మోడీ జన్మదినం సెప్టెంబర్ 17ని “జాతీయ నిరుద్యోగ దినోత్సవం”గా పాటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధానిని నిరుద్యోగ సమస్యపై ప్రశ్నించారు. ఎనిమిది చీతాలు వచ్చాయి.. 16కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అంటూ మోదీని రాహుల్ ప్రశ్నించారు.

Rahul Gandhi: 16కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ

Rahual Gandi

Rahul Gandhi: నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో ఇండియాకు చేరిన ఎనిమిది చీతాల్లో మూడింటిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి) వద్ద ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు. ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీని ట్విటర్ ద్వారా ఉద్యోగాల విషయంపై ప్రశ్నించారు. ఎనిమిది చీతాలు భారతదేశానికి వచ్చాయి.. ఇప్పుడు చెప్పండి ఎనిమిదేళ్లలో 16కోట్ల ఉద్యోగాలు ఎందుకు రాలేదు? అంటూ రాహుల్ ప్రధాని మోదీని ప్రశ్నించారు.

#NationalUnemploymentDay: ‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్న నిరుద్యోగులు

మోడీ జన్మదినం సెప్టెంబర్ 17ని “జాతీయ నిరుద్యోగ దినోత్సవం”గా పాటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఎనిమిదవ రోజు  భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ.. విద్వేష రాజకీయాల కారణంగా భారతదేశం ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు.

తాజాగా రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఎనిమిది చీతాలు వచ్చాయి.. మరి ఏడాది రెండు కోట్లు చొప్పున మీరిస్తామన్న ఉద్యోగాలు ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అంటూ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 10వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కేరళ రాష్ట్రంలో సాగింది. ఈ యాత్రలో యువతీయువకులు రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ‘ మాకు ఉద్యోగాలు కావాలి’ అంటూ కేంద్రాన్ని కోరుతూ  ప్లకార్డులు పట్టుకొని పాదయాత్రలో రాహుల్ వెంట నడిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్ తన ట్వీట్ లో జోడించారు.