Rahul Gandhi: రాహుల్ గాంధీకి కౌంటర్.. అహంకారానికి, నిర్లక్ష్యానికి వ్యాక్సిన్ లేదు – హెల్త్ మినిష్టర్

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్ష్ వర్ధన్ శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కౌంటర్ వేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కొరత అంటూ ట్విట్టర్లో ప్రశ్నించినందుకు గానూ..

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కౌంటర్.. అహంకారానికి, నిర్లక్ష్యానికి వ్యాక్సిన్ లేదు – హెల్త్ మినిష్టర్

Rahul Gandhi

Rahul Gandhi: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్ష్ వర్ధన్ శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కౌంటర్ వేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కొరత అంటూ ట్విట్టర్లో ప్రశ్నించినందుకు గానూ.. ఈ సమస్యకు వ్యాక్సిన్ లేదని విమర్శించారు. మీరు నా ట్వీట్ చదవలేదా.. లేదంటే మీకు అర్థం కాలేదా అంటూ ప్రశ్నించారు.

ముందుగా రాహుల్ గాంధీ.. జులై వచ్చేసింది.. వ్యాక్సిన్లు ఇంకా రాలేదు అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

ట్వీట్ చేసిన గంట తర్వాత రెస్పాండ్ అయిన హెల్త్ మినిష్టర్.. నిన్ననే జులైలో వ్యాక్సిన్ అందుబాటు గురించి ట్వీట్ చేశాను. రాహుల్ గాంధీ సమస్యేంటి. ఆయన చదవలేదా.. లేదా అర్థం కాలేదా. నిర్లక్ష్యానికి, అహంకారానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. కాంగ్రెస్ సరైన నాయకత్వం గురించి ఆలోచించాలి’ అంటూ ట్వీట్ చేశారు.


వ్యాక్సినేషన్ పాలసీపై రాహుల్ పలు మార్లు ట్వీట్ చేస్తూనే ఉన్నారు. గత వారం ప్రధాని మోదీని వ్యాక్సిన్ కొరత అనేది లేకుండా చేయాలని కోరారు.

గురువారం మంత్రి హర్ష్ వర్ధన్ చేసిన ట్వీట్ లో జులై నెలలో రాష్ట్రాలకు ప్రైవేట్ హాస్పిటల్స్ తో సహా 12కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపుతామని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఎక్కువగా వేసుకుంటుండకపోవడంతో తగ్గించామని వివరించారు.