What is Surrogacy: సరోగసీ అంటే ఏమిటీ? సెలెబ్రిటీలు సరోగసీని ఎందుకు ఎంచుకుంటున్నారు? | What is Surrogacy, why surrogacy popular among Indian celebrities?

What is Surrogacy: సరోగసీ అంటే ఏమిటీ? సెలెబ్రిటీలు సరోగసీని ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఆరోగ్యంగా ఉండి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. ప్రతి మహిళా అమ్మతనాన్ని ఆస్వాదించాలిగానీ..ఇలా డబ్బుతో ఆ కమ్మదనానికి దూరం కాకూడదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

What is Surrogacy: సరోగసీ అంటే ఏమిటీ? సెలెబ్రిటీలు సరోగసీని ఎందుకు ఎంచుకుంటున్నారు?

What is Surrogacy: ప్రముఖ నటి, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి సరోగసీ పద్దతిలో ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించింది. “సర్రోగేట్ ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వడం తమకు అమిత ఆనందాన్ని ఇచ్చిందని” ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. దీంతో ఈజంటకు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. వీరే కాదు, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు, శిల్పాశెట్టి దంపతులు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారు. వ్యాపారవేత్తలు, ప్రముఖులు సరోగసీ విధానం ద్వారా పిల్లలను పొందారు. వీరంతా ఈ సరోగసీ ద్వారా పిల్లలను ఎందుకు కంటున్నారు?. సరోగసీ అంటే ఏమిటీ? అనే విషయాలు మీకోసం.

సరోగసీ అంటే ఏమిటీ? ఎన్ని రకాలు?:
పిల్లలను కనాలనుకునే జంట నేరుగా కాకుండా మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరోగసీ అంటారు. పిల్లలు కావాలనుకునే జంటలో.. పురుషుడి వీర్యాన్ని స్వీకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ జంట కోసం పిల్లలను తన కడుపులో పెంచి, ప్రసవించే మహిళను సరోగేట్ మదర్ అంటారు. కేవలం పురుషుడి వీర్యంతో బిడ్డను కనిపెంచిన ఆ మహిళ, బిడ్డకు బయోలాజికల్ మదర్ అయినప్పటికీ.. ప్రసవం అనంతరం ఆ స్త్రీకీ, బిడ్డకూ ఎటువంటి సంబంధం లేకుండా ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. సరోగసీలో ఈ పద్ధతిని సాంప్రదాయ(Traditional surrogacy) పద్ధతిగా పిలుస్తారు.

Also Read: KURNOOL BJP SABHA: బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. వైసీపీపై కమలదళం ఫైర్!

సరొగసీలో మరొక పద్ధతి కూడా ఉంది. జెస్టేషనల్ సరోగసీ(Gestational surrogacy)గా పిలిచే ఈ రెండో విధానంలో పిల్లలు కావాలనుకునే జంటలోని స్త్రీ అండాన్ని, పురుషుడి స్పెర్మ్‌తో ఫలదీకరణం చెందిస్తారు. అనంతరం ఆ పిండాన్ని సర్రోగేట్ యొక్క గర్భాశయం(అద్దె గర్భం)లో ఉంచుతారు. వైద్యుల పర్యవేక్షణలో సమయానికి ఆమె ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఎక్కువమంది జంటలు ఈ జెస్టేషనల్ సరోగసీని ఎంచుకుంటారు. ఈ పద్దతిలో ఎవరి అండం ద్వారా బిడ్డ జన్మించిందో వారు బయోలాజికల్ పేరెంట్స్ గా నిలుస్తారు. బిడ్డపై సర్రోగేట్ మదర్ కు ఎటువంటి హక్కులు ఉండవు. కేవలం ప్రసవానికి, అద్దె గర్భానికి ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లిస్తారు.

Also read: India Omicron : దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ.. 10వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

సరొగసీని ఎందుకు ఎంచుకుంటున్నారు?
సరోగసీ ద్వారా బిడ్డను కనడం వెనుక దంపతుల యొక్క వ్యక్తిగత సమస్యలు సహా అనేక కారణాలున్నాయి. పిల్లలు కావాలనుకునే దంపతులలో సంతానోత్పత్తి సమస్యలు ఉన్నా, స్త్రీకి గర్భస్రావం లేదా గర్భం ప్రమాదకరంగ మారినపుడు మరియు గర్భం దాల్చలేని సమయంలో ఈ సరోగసీ పద్దతిని ఎంచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సరోగసీ విధానం వేగంగా విస్తరిస్తున్న పద్ధతి. అందులోనూ భారత్ లో ఈమధ్య కాలంలో సరోగసీ పద్ధతి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక సెలెబ్రిటీలు సరొగసీని ఎంచుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ, ఫ్యాషన్ రంగాలకు చెందిన మహిళలు ఈ సరొగసీని ఎంచుకుంటున్నారు. కాన్పు అనంతరం స్త్రీలో వచ్చే శారీరక మార్పుల కారణంగా..ఎక్కడ తాము వృత్తికి దూరం అవుతామనే భ్రమలో కొందరు ఈ సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను పొందుతున్నారు.

బిజిెనెస్ గా సరోగసీ?
సంతానం కోసం కొందరు జంటలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారి వ్యక్తిగత కారణాలు ఎలా ఉన్న.. మనదేశంలో మాత్రం ఐవీఎఫ్, “సరోగసీ” వంటి పద్ధతులు పరోపకారంగా కన్నా ఒక వ్యాపారంగా అవతరించాయనే చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారు. మరీముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్ గా మారుతున్నారు. సర్రోగేట్ గా అద్దెకు గర్భాన్ని ఇచ్చేందుకు పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు డబ్బు వసూలు చేస్తున్నారు మహిళలు. అదే సమయంలో నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నియమ నిబంధనలను కఠినతరం చేసింది.

Also read: Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

దుర్వినియోగం మరియు ప్రభుత్వ చట్టాలు:
2020లో సరోగసీ నియంత్రణ బిల్లులో కొన్ని సంస్కరణలు చేర్చిన ప్రభుత్వం..గర్భాన్ని అద్దెకు ఇచ్చే వారికీ కొని షరతులు విధించింది. సర్రోగేట్ గా మారే మహిళకు వివాహం అయిఉండాలి(విడాకులు పొందినా మహిళలకు వర్తింపు). ఆమె సొంతంగా ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. సర్రోగేట్ మదర్ వయస్సు కనీసం 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండి, సరోగసీని ఎంచుకున్న జంటకు దగ్గరి బంధువు అయి ఉండాలి. ఇక భారత్ లో వాణిజ్య పరమైన సరోగసీని నిషేధించి..పరోపకార సరోగసీని ప్రోత్సహించేలా సరోగసీ నియంత్రణ బిల్లుకు సవరణలు చేసింది ప్రభుత్వం. జనవరి 25, 2022 నుండి అమలులోకి రానున్న ఆ చట్టం ప్రకారం.. ఒక సర్రోగేట్ తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే సరోగసి మదర్ గా మారాలి. గతంలో ఇది మూడు సార్లుగా ఉండేది. ఒప్పందంలో సర్రోగేట్ యొక్క వైద్య ఖర్చులు మరియు ఇన్సూరెన్సు కవరేజ్ మినహా, ఇతర ఛార్జీలు ఉండకూడదు. కడుపులో ఉన్న బిడ్డకు సంబంధించి ఎటువంటి ఖర్చునైనా సరోగసి పొందుతున్న తల్లిదండ్రులు చెల్లించాలి.

ఇది సరోగసీ గురించిన కొన్ని వివరాలు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో కొందరు మహిళలు సంతానాన్ని పొందలేక దుఃఖిస్తుంటే.. డబ్బున్న కొందరు సెలెబ్రిటీలు ఇలా అద్దె గర్భం ద్వారా సంతానాన్ని కలగడంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యంగా ఉండి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. ప్రతి మహిళా అమ్మతనాన్ని ఆస్వాదించాలిగానీ..ఇలా డబ్బుతో ఆ కమ్మదనానికి దూరం కాకూడదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also read: IPS Officers Promotion : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి

×