రైతుల దీక్ష ఫ్యూచరేంటి? రిపబ్లిక్‌డే ట్రాక్టర్‌ ర్యాలీపై ఏ నిర్ణయం తీసుకోనున్నారు?

రైతుల దీక్ష ఫ్యూచరేంటి? రిపబ్లిక్‌డే ట్రాక్టర్‌ ర్యాలీపై ఏ నిర్ణయం తీసుకోనున్నారు?

Farmar’s Protest: కొత్త సాగు చట్టాలపై రైతు సంఘాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను ముక్తకంఠంతో తిరస్కరించారు రైతులు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మరి రైతుల దీక్ష ఫ్యూచరేంటి? రిపబ్లిక్‌డే ట్రాక్టర్‌ ర్యాలీపై అన్నదాతలు ఏ నిర్ణయం తీసుకోనున్నారు?

నూతన చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి విజ్ఞాన్‌భవన్‌లో కేంద్రం, రైతు సంగాల మధ్య చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో ఒకటిన్నరేళ్ల పాటు నిలుపుదల చేస్తామని రైతుల ముందుకు ప్రతిపాదన తెచ్చింది కేంద్రం. వీటి అమలును స్తంభింపజేసి, ఒక సంయుక్త సంఘాన్ని నియమిస్తాని రైతు సంఘాలకు తెలిపింది. దానిపై అంతర్గతంగా చర్చించుకుని తుది నిర్ణయానికి వచ్చాయి రైతు సంఘాలు. కొత్త సాగు చట్టాలు నిలుపుదల చేయడం కాదని, పూర్తికా రద్ధు చేసేవరకూ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు రైతు సంఘాలు. నేడు జరగబోయే పదకొండవ విడత చర్చల్లో కేంద్రానికి అదే చెబుతామని తెలిపారు రైతులు.

గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్‌ ర్యాలీపై కూడా రైతులు పట్టు వీడటం లేదు. సింఘు సరిహద్దుకు సమీపంలోని ఓ రిసార్టులో రైతు సంఘాల ప్రతినిధులు, పోలీసులు చర్చలు జరిపారు. ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్ల ర్యాలీని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్వహించాలని సూచించారు. రైతులు మాత్రం ముందు అనుకున్న విధంగానే దిల్లీ ఔటర్‌ రింగురోడ్డుపైనే ర్యాలీని నిర్వహిస్తామని పట్టుబట్టుతున్నారు. వ్యవసాయచట్టాల రద్దు కోసం దిల్లీలో మేం ర్యాలీని ప్రశాంతంగా నిర్వహించాలనుకుంటున్నామని, కానీ పోలీసులు ఢిల్లీకి బయట ర్యాలీని నిర్వహించాలని సూచిస్తున్నారాయన. దానికి మేం ఏమాత్రం ఒప్పుకోమని తెలిపారు.

మరోవైపు.. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ రైతులతో సంప్రదింపులను ప్రారంభించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన భేటీలో.. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపినట్లు ప్రకటించింది సుప్రీం నియమించిన కమిటీ. ఈ చర్చల్లో పాల్గొన్న రైతు సంఘాలు సాగు చట్టాలపై తమకున్న అభిప్రాయాలతో పాటు చట్ట అమలుకు పలు సూచనలు చేశారని కమిటీ తెలిపింది.

ఇక, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనల బాట పట్టడం వల్ల.. దాదాపు 50వేల కోట్ల విలువైన వాణిజ్య నష్టం వాటిల్లినట్లు అంచానా వేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌. సాగు చట్టాలను ఒకటిన్నరేళ్లపాటు నిలుపుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన న్యాయబద్ధమైనదన్నారు సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీన్‌ ఖండేల్‌వాల్‌. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైతు సంఘాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు.