BRAHMA ASTRA : ‘బ్రహ్మస్త్రం’ విషయంలో పురాణాలకు..సైన్స్‌కు ఉన్న పోలిక ఏంటి..?

టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయినా.. దానికి మూలం పురాణ ఇతిహాసాలే అనే మాట ఉంది. బ్రహ్మాస్త్రం విషయంలో అది పక్కాగా నిజం అనిపిస్తుంది. లేటర్ టెక్నాలజీ నుంచి న్యూక్లియర్ బాంబ్ వరకు.. బ్రహ్మాస్త్ర నియమాలు కచ్చితంగా గుర్తుకు వస్తాయ్. ఇంతకీ బ్రహ్మస్త్ర విషయంలో పురాణాలకు, సైన్స్‌కు ఉన్న పోలిక ఏంటి.. సంబంధాలు ఏంటి ?

BRAHMA ASTRA : ‘బ్రహ్మస్త్రం’ విషయంలో పురాణాలకు..సైన్స్‌కు ఉన్న పోలిక ఏంటి..?

Brahma Astra

BRAHMA ASTRA : టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయినా.. దానికి మూలం పురాణ ఇతిహాసాలే అనే మాట ఉంది. బ్రహ్మాస్త్రం విషయంలో అది పక్కాగా నిజం అనిపిస్తుంది. లేటర్ టెక్నాలజీ నుంచి న్యూక్లియర్ బాంబ్ వరకు.. బ్రహ్మాస్త్ర నియమాలు కచ్చితంగా గుర్తుకు వస్తాయ్. ఇంతకీ బ్రహ్మస్త్ర విషయంలో పురాణాలకు, సైన్స్‌కు ఉన్న పోలిక ఏంటి.. సంబంధాలు ఏంటి ?

బ్రహ్మాస్త్రం అంటే.. అంతకుమించి ఆయుధం లేదని అర్థం! శత్రువుకు ఊపిరి ఆడకుండా చేయడం కాదు.. ఊపిరి లేకుండా చేసేంత పవర్‌ఫుల్‌. అందుకే భారత సైన్యంలోనూ శక్తివంతమైన మిస్సైల్స్‌కు బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. పురాణ ఇతిహాసాల్లో మాత్రమే బ్రహ్మాస్త్రం పేరు వినిపించినా.. మోడ్రన్ మిస్సైల్ టెక్నాలజీకి బ్రహ్మాస్త్ర టెక్నిక్స్‌ మూలం అన్న చర్చ కూడా ఉంది. మహా భారత కాలంలో అణు యుద్ధాలు జరిగాయా.. వాటికి బ్రహ్మాస్త్రాలే కారణం అయ్యాయా అన్న పరిశోధన ఇప్పటికీ జరుగుతూనే ఉంది.

సృష్టి కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు… దాని సమతుల్యతను కాపాడేందుకు సత్యము, ధర్మము అనే రెండు బలమైన శాసనాలను తయారుచేశారు. వ్యక్తుల వల్ల కానీ.. శక్తుల వల్ల కానీ.. సత్యం, ధర్మము గాడి తప్పినప్పుడు వారిని శిక్షించడానికి ఒక బలమైన అస్త్రం కావాలని తలచిన బ్రహ్మ.. తన మహిమతో సృష్టించిందే బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రం తయారీలో ప్రకృతి శక్తుల నుంచి కొన్ని మూలికలు తీసుకున్నారు. అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత.. నిర్దేశించిన ప్రాంతంలోనే పడేలా… ప్రయోగించే వ్యక్తి స్వరాన్ని మాత్రమే అస్త్రం ఫాలో అయ్యేలా బ్రహ్మాస్త్రాన్ని సృష్టించారు. దాన్నే ప్రస్తుతం లేజర్ టెక్నాలజీ అంటున్నారు.

బ్రహ్మాస్త్రం అనేది అనేది ఈ నాటి బాంబుల్లానే… మారణకాండ సృష్టించగల అస్త్రం. మహాభారత కాలం నాటి అస్త్రాలు ఇప్పటి అణ్వాయుధాల కంటే భయంకరమైనవని అంటూ గోర్బోవ్ అనే రష్యన్ పండితుడితో ఎంతోమంది అంచనాలు వేశారు. బ్రహ్మాస్త్రం సంధిస్తే దాన్ని ప్రభావం వందల కిలోమీటర్లు ఉంటుందని ఇతిహాసాలు చెప్తున్నాయ్. రామాయణంలోనూ లక్ష్మణుడిని బ్రహ్మస్త్ర ప్రయోగంపై వారిస్తారు. దాన్ని సంధిస్తే లోక వినాశనమే అని అంటారు. ఇప్పుడు అణుబాంబుల విషయంలోనూ అలాంటి ప్రస్తావనే వస్తోంది. ఇప్పటి అణుబాంబులే.. అప్పటి బ్రహ్మస్త్రాలు !

ప్రస్తుతం చాలా దేశాలు ఉపయోగిస్తున్న మిస్సైల్స్‌కు.. దాచిపెట్టుకున్న అణుబాంబులకు ఆనాటి బ్రహ్మాస్త్రమే మోడల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బ్రహ్మాస్త్రం అంటే ఓ భరోసా.. ఓ ధైర్యం.. ఓ కాపలా ! సృష్టికి అపాయం తలెత్తినప్పుడు సంధించేందుకు త్రిమూర్తులు ఈ ఆయుధాన్ని సృష్టించారు. రామాయణంలో రాముడు సంధించినా.. మహాభారతంలో అర్జునుడు ప్రయోగించినా.. చెడు మీద మంచి విజయం కోసం మాత్రమే ! రామాయణంలో ఇంద్రజిత్తు, భారతంలో అశ్వత్థాముడు.. స్వార్థం కోసం మహా ఆయుధాన్ని వినియోగించినా.. తిరిగి వారి పాపానికే కారణం అయింది. మహాభారతం, రామాయణం కథలు అనుకున్నా.. ఈ తరానికి నేర్పే పాఠాలు చాలానే ఉంటాయ్. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం విషయంలో ఇంకా ఉన్నాయ్. ఇది మాత్రం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి.