vaccine రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా..ఇంట్లోనే ఉండమంటే ఎలా ?: హైకోర్టు

రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాక కూడా ఇంట్లోనే ఉండమంటే ఎలా? వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలని అనటంలో అర్థం ఏముంది? కరోనా వచ్చిన కొత్తలో కంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పరిస్థితికి తేడా ఉందనీ..వ్యాక్సిన్లు తీసుకుని కూడా ఇంట్లోనే కూర్చోవాలని ఎవరూ కోరుకోరు’’ అంటూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది.

vaccine రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా..ఇంట్లోనే ఉండమంటే ఎలా ?: హైకోర్టు

What Is Use Of Taking Corona Vaccine

What is use of taking Corona vaccine : ఈ కరోనా కాలంలో పని ఉంటే తప్ప బయటకు రావద్దని..ఎంతో అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.కానీ ఎన్ని రోజులని..ఎన్ని నెలలని ప్రజలు వారి వారి పనులు మానేసుకుని కూర్చుంటారు. ప్రయాణాలుచేయకుండా..బయటకు రాకుండా ఎలా ఉండగలరు?అదెలా సాధ్యమవుతుంది.పైగా ‘‘కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాక కూడా ఇంట్లోనే ఉండమంటే ఎలా? వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలని అనటంలో అర్థం ఏముంది? కరోనా వచ్చిన కొత్తలో కంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పరిస్థితికి తేడా ఉందనీ..వ్యాక్సిన్లు తీసుకుని కూడా ఇంట్లోనే కూర్చోవాలని ఎవరూ కోరుకోరు’’ అంటూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది.

కాగా ఇటీవల కాలంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి. ఎంతో అవసరం ఉంటే తప్ప ప్రజలు బయట తిరగవద్దని ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం రెండు డోసులు వేయించుకున్నా లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించవద్దని కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్లు ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ సిబ్బంది మాత్రమే లోకల్ ట్రైన్లలో ప్రయాణించటానికి అనుమతినిచ్చింది.

ఈ అంశంపై లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు లాయర్లను అనుమతించాలంటూ సీనియర్ న్యాయవాది మిలింద్ సాఠే, శ్యామ్ దేవాని, అలంకార్ కిర్పెకర్ లతో పాటు కొంతమంది వ్యక్తులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నాక కూడా ప్రజల్ని ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశిస్తున్నప్పుడు…మరి వ్యాక్సిన్లు తీసుకుని ప్రయోజనం ఏంటి? అంటూ ప్రశ్నించింది.

కరోనా ప్రారంభమైన పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందని..వ్యాక్సినేషనే దీనికి కారణమని..వ్యాక్సిన్లు తీసుకున్నవారి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని… లేకుంటే..వ్యాక్సిన్ తీసుకుని ప్రయోజనం ఏమిటని ధర్మానం ప్రశ్నించింది. రెండు డోసులు వ్యాక్సిన్లు తీసుకుని కూడా ఇంట్లోనే కూర్చోవాలని ఎవరూ అనుకోరని వ్యాఖ్యానించింది. లాయర్లు కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది.

వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి పూర్తిగా సడలింపులు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఆలోచన ఉందా? అంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంట్లోనే కూర్చుంటే ఆర్థికపరంగా, పనిపరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని ఈ విషయం గమనిచాలని తెలిపింది. లోకల్ రైళ్లలో ప్రయాణాలకు అనుమతిస్తే రోడ్లపై జనాల రద్దీ తగ్గుతుందని..దీనికి సహకరించేందుకు రైల్వేలు కూడా సిద్ధంగా ఉన్నాయని..ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభించాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణ జులై 5న కొనసాగుతుందని తెలిపింది బాంబో హైకోర్టు.