Cheetahs Coming..Africa to India : ఆఫ్రియా నుంచి భారత్ కు రానున్న చీతాల రాకతో ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయ్ ?

దాదాపు 50ఏళ్ల తర్వాత భారతీయ గడ్డపై చీతాల పరుగులు చూడబోతున్నాం.. ఆఫ్రియా నుంచి భారత్ కు చీతాలు రానున్నాయి. బారత్ లో చీతాలు ఎందుకు అంతరించిపోయాయ్.. అసలు ఆఫ్రికన్ చీతాలు భారత వాతావరణంలో ఇమడగలవా.. ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి..?

Cheetahs Coming..Africa to India : ఆఫ్రియా నుంచి భారత్ కు రానున్న చీతాల రాకతో ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయ్ ?

Cheetahs Coming From Africa to India

Cheetahs Coming From Africa to India : దాదాపు 50ఏళ్ల తర్వాత భారతీయ గడ్డపై చీతాల పరుగులు చూడబోతున్నాం.. అసలు చీతాలు ఎందుకు అంతరించిపోయాయ్.. భారత్‌కు చీతాలను తీసుకువచ్చిం ఏం చేయబోతున్నారు.. అసలు ఆఫ్రికన్ చీతాలు మన దగ్గర వాతావరణంలో ఇమడగలవా.. ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయ్..

దక్షిణాఫ్రికా, నమీబియా తీసుకొచ్చిన చీతాలను.. నెల రోజులపాటు మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతారు. ఆ తర్వాత లక్షా 15వేల హెక్టార్ల సువిశాల ఆ జాతీయ పార్కులో వీటిని స్వేచ్ఛగా వదిలేస్తారు. ఐతే కూనో నేషనల్‌ పార్క్‌లో చీతాలకు చిరుతల నుంచి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చీతాలను కాపాడడం మధ్యప్రదేశ్ అటవీ సిబ్బందికి కష్టంతో కూడుకున్న వ్యవహారమే ! చీతాలు వేగంగా పరిగెడతాయి కానీ.. దాడికి గురి అవుతుంటాయ్. ఘర్షణల నుంచి అవి దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాయ్‌. చీతాలతో కంపేర్‌ చేస్తే చిరుతలు చాలా పెద్దవి. పైగా బలంగా ఉంటాయ్. దీంతో భారతీయ చిరుతలు.. చీతాలపై దాడులకు దిగడమే కాదు చంపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూనో నేషనల్‌ పార్క్‌లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండే చాన్స్ ఉంది.

కూనో నేషనల్‌ పార్క్‌లో చిరుతలు ఎక్కువగా ఉంటాయ్. ప్రతీ వంద చదరపు కిలోమీటర్లకు 9 చిరుతలు సంచరిస్తుంటాయ్. అలాంటి చిరుతల నుంచి.. చీతాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఐతే ప్రస్తుతం భారత్‌కు తీసుకొస్తున్న చీతాలు.. సింహాలు, లెపర్డ్‌లు, హైనాలు, అడవి కుక్కల మధ్య జీవించినవే ! కూనో నేషనల్‌ పార్క్‌లో వాటికి మొదటగా పెద్దపెద్ద ఎలుగుబంట్లు, తోడేళ్లు, హైనాలు ఎదురుపడొచ్చు. మరోవైపు వాటికి ఇక్కడ భిన్న రకాల జింకలు ఆహారంగా దొరుకుతాయి. ఐతే చిరుతల నుంచి కాపాడేందుకు.. కొద్దిరోజుల పాటు కూనోలో చీతాలు వదిలేసే ప్రాంతంలో 12 కిలోమీటర్ల చుట్టూ.. 9అడుగుల ఎత్తుతో భారీ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు.

భారత్‌లో చీతాలు మనుగడ సాగించలేవని అనుమానాలు
కంచెలూ లేని కూనో లాంటి అభయారణ్యాల్లో ఈ చీతాలు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఉపగ్రహ సమాచారం లేదా వీహెచ్‌ఫీ ట్రాకింగ్ కాలర్స్ సాయంతో వీటిని ఒక కంట కనిపెడుతుంటారు. ఎప్పటికప్పుడు వీటిని తెచ్చి మళ్లీ పార్క్ మధ్యలో వదిలిపెడుతుంటారు. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాంతానికి చీతాలు అలవాటు పడతాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. భారత్‌లో ఈ చీతాలు మనుగడ సాగించలేవని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నాహరు. ఇక్కడ అటవీ ప్రాంతం తగ్గిపోతోందని… దీంతో నేషనల్ పార్కులపై ఒత్తిడి పెరుగుతుందన్నది మరికొందరి వాదన. ఐతే కూనోలో సరిపడా చోటు ఉందని… ఇక్కడ చీతాలకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు.

అక్బర్ పాలనలో పదివేల చీతాలు..
నిజానికి ఆఫ్రికన్ చీతా ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్‌ను 2009లోనే మొదలుపెట్టాలని అనుకున్నారు. ఐతే అప్పట్లో యూపీఏ సర్కార్‌ ఈ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం అంతగా ఫోకస్ పెట్టలేదు. దీంతో పదేళ్లకు పైగా ఆలస్యమైంది. మళ్లీ ఈ ప్రాజెక్ట్‌పై ఎన్డీఏ సర్కార్ ఫోకస్ పెట్టింది. గత నవంబర్‌లోనే ఆఫ్రికన్‌ చీతాలను తేవాల్సి ఉన్నా… కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఇప్పుడు కోవిడ్ ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుండడంతో… చీతాలను తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు. చరిత్రలో చూస్తే.. మనదేశంలో ఒకప్పుడు చీతాలు భారీగా ఉండేవి. ఐతే 19వందల సంవత్సరం నాటికి చాలావరకు కనుమరుగు అయ్యాయ్. ఇంకా చరిత్రలోకి వెళ్తే.. మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ హయాంలో ప్రపంచంలోనే మొట్టమొదటి చీతాను బంధించి పెంచారు. అక్బర్ పాలనలో పదివేల చీతాలు ఉండేవి. అందులో వెయ్యి చీతాలు అక్బర్ ఆస్థానంలోనే తిరిగేవి. 20వ శతాబ్దంలో చీతాలను క్రీడల కోసం దిగుమతి చేసుకునేవారు.

చీతాలకు చిరుతలకు తేడాలు..
చీతాలు, చిరుతలు చూడ్డానికి సేమ్‌ అనిపించినా.. చాలా తేడాలు ఉంటాయ్. చిరుతలాగే చుక్కలతో చీతా అందంగా ఉంటుంది. ఐతే చెట్లు ఎక్కలేదు. చీతాల్లో.. ఆసియా రకం, ఆఫ్రికా రకం అనే రెండు జాతులు ఉన్నాయ్. ప్రస్తుతం ఆసియా రకం చీతా అంతరించి పోయే జాతుల్లో ఒకటి ! కేవలం 70 నుంచి 80 వరకూ మాత్రమే బతికి ఉన్నాయ్. ఐతే ఇప్పుడు ఆఫ్రికా చీతాలను భారత్‌కు తీసుకువస్తున్నారు.. మొత్తమ్మీద 50ఏళ్ల కింద అంతం అయింది అనుకున్న చీతాజాతికి.. మళ్లీ ప్రాణం పోయాలని ప్రయత్నిస్తున్నారు.